UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
- డిసెంబర్ 12న కుటుంబంతో అయోధ్య రామమందిరానికి అఖిలేష్ యాదవ్..
- హిందూ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగానే..
- బీజేపీ హిందుత్వ కార్డ్‌ను తిప్పకొట్టే వ్యూహం..
- ముస్లిం బుజ్జగింపు ముద్రను తొలగించుకునే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections: దేశవ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తుంటే, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్ కూటమి ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూపీలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. జనవరిలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
కుల సమీకరణాల్లో బీజేపీ, ఎస్పీలు ఇప్పటికే స్పీడ్ పెంచాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ ఎప్పుడూ లేని విధంగా హిందూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా అఖిలేష్ యాదవ్ డిసెంబర్ 12న తన కుటుంబం మొత్తంతో అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించనున్నట్లు ప్రకటించారు.
Also Read
అయోధ్యకు ఎందుకు..?
సంప్రదాయకంగా ఎస్పీకి ముస్లిం ఓటర్లు, యాదవ ఓటర్లు పెద్ద ఓట్ బ్యాంక్‌గా ఉన్నారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ ‘‘పీడీఏ’’( వెనకబడిన, దళిత్, అల్పా సంఖ్యాకులు) అనే ఫార్ములాతో బీజేపీకి షాక్ ఇచ్చారు. ఆ సమయంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రిజర్వేషన్లు తీసేస్తారని ఎస్పీ, కాంగ్రెస్ ప్రచారం చేసి విజయం సాధించాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఈ ఫార్ములా పనిచేస్తుందా లేదా? అనే దానిపై ఎస్పీలో సందేహాలు ఉన్నాయి.
ఇక ఎప్పుడు అయోధ్య, రామ మందిరం మాట ఎత్తని అఖిలేష్ యాదవ్ శ్రీరాముడిని దర్శించుకోవడం వెనక హిందూ సమాజంలోని మెజారిటీ ఓటర్లను ఆకట్టుకునే ప్లాన్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తు్న్నారు. యాదవుల్లోని ఒక వర్గం అఖిలేష్ ఎందుకు రామ మందిరాన్ని సందర్శించడం లేదనే ప్రశ్నని లేవనెత్తుతున్నారు. అధికార బీజేపీ కూడా ఎస్పీని ముస్లిం అనుకూల పార్టీగా చిత్రీకరించే పనిని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ మందిరానికి వెళ్తున్నట్లు అఖిలేష్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఓవైసీ-ఆజాద్ పొత్తుతో అఖిలేష్లో టెన్షన్..
ఎంఐఎం చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌లు ‘సోషల్ చేంజ్ ఫ్రంట్’ పేరుతో పొత్తును ప్రకటించారు. యూపీలోని మొత్తం 403 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పొత్తుతో అఖిలేష్‌కు ఇన్నాళ్లు వెంట నిలిచిన ముస్లిం, దళిత ఓట్ బ్యాంక్‌పై ప్రభావం పడే ఛాన్స్ ఉందనే టెన్షన్ సమాజ్‌వాదీ పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను ఆకర్షించాలని అఖిలేష్ ప్లాన్ చేస్తున్నారు.
ముస్లింలోని 2-3 శాతం ఓటర్లు ఓవైసీ వైపు వెళ్తే ఎస్పీ నేతల గెలుపు కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలోని ప్రత్యేకంగా హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు రామమందిర దర్శనాన్ని అఖిలేష్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ముస్లిం అనుకూల ముద్ర తొలగించుకోవడానికే..
బీజేపీ హిందుత్వ కార్డును తిప్పికొట్టాలనే అఖిలేష్ అయోధ్య పర్యటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా రామ మందిరం నిర్మితమై మూడేళ్లు అవుతున్నా అఖిలేష్ కానీ ఎస్పీ నేతలు కానీ, కూటమిలో ఉన్న కాంగ్రెస్ కానీ రామమందిరానికి వెళ్లలేదు. దీనిని ఆసరాగా చేసుకుని బీజేపీ ఎస్పీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పిస్తోంది. దీనిని నిర్వీర్యం చేయాలని అఖిలేష్ భావిస్తున్నారు. బీజేపీకి అండగా నిలుస్తున్న హిందూ ఓటర్లలో కొందరినైనా తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో 1990లలో అధికారంలో ఉన్న ములాయం సింగ్ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వం కరసేవకులపై కాల్పులు జరిపింది. బీజేపీ అప్పటి నుంచి ఈ కాల్పుల ఘటనను వాడుకుంటూ ఎస్పీని ‘‘హిందూ వ్యతిరేక’’, ముస్లిం బుజ్జగింపు పార్టీగా ముద్ర వేస్తోంది. ఇక 2013లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అయోధ్య గుండా అనధికారిక 84-కోసి పరిక్రమ యాత్రను ప్రారంభించడానికి ప్రయత్నించింది. ఇది 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు మత ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనిని నిషేధించి, భారీ భద్రతను ఏర్పాటు చేశాడు. దీంతో బీజేపీ అఖిలేష్‌ను హిందూ వ్యతిరేక, రాముడి వ్యతిరేక వ్యక్తిగా విమర్శిస్తోంది. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అఖిలేష్ అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకునేందుకు వెళ్తున్నాడు.
తాజావార్తలు
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!