Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాట మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోందా..? సిల్వర్ స్క్రీన్ పై విలక్షణ నటుడిగా పేరొందిన ధనుష్, కొత్త పార్టీ పెట్టబోతున్నారా.? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రైజింగ్ స్టార్ గా పేరొందిన ధనుష్ రియల్ లైఫ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతోంది? తన రాజకీయ రంగప్రవేశంపై ధనుష్ ఏమంటున్నారు? ధనుష్ పై మిగిలిన రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి..?
తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల నుంచి నేటి తరం విజయ్ వరకూ వెండితెరపై రాణించిన ఎందరో రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.
ఇప్పుడు ఇదే కోవలో నేషనల్ అవార్డ్ గ్రహీత, వర్సటైల్ హీరో ధనుష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల చెన్నైలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ధనుష్ తన ఫ్యాన్ క్లబ్ మహిళా విభాగంతో రహస్య సమావేశం నిర్వహించారు. దీనికి సుమారు 3,000 మంది మహిళలు, ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు. ఈ రహస్య సమావేశం తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విల్లువాక్కం, పెరంబూర్ వంటి వివిధ ప్రాంతాల నుంచి మహిళా అభిమానులు తరలి వచ్చారు. ధనుష్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళలందరికీ ధనుష్, దీపావళి కానుకలుగా వెండి కామాక్షి దీపాలను అందించారు.
Also Read
- China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
- Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
- META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
- GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
ఈ సమావేశం కేవలం ఒక సాధారణ ఫ్యాన్ మీట్ లా కనిపించినప్పటికీ, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత అక్టోబర్ 14న కోయంబత్తూరులో ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్ జరిగింది. అందులో ధనుష్ తన అభిమాన సంఘాన్ని ‘ధనుష్ నపర్ని మంద్రం’ నుండి ‘ధనుష్ నపర్ని ఇయక్కం’ అంటే ‘ధనుష్ వెల్ఫేర్ మూవ్మెంట్’గా మార్చారు. అంతేకాకుండా, కొత్త లోగో ఆవిష్కరించారు. అందులో ఎరుపు రంగు నక్షత్రంతో పాటు ధనుష్ చేతులు జోడించి ఉన్న ఫోటోను ఖరారు చేశారు. ఈ సంస్థాగత మార్పులు, క్షేత్రస్థాయిలో మహిళా శక్తిని కూడగట్టే ప్రయత్నాలు ఆయన రాజకీయ అరంగేట్రానికి పునాదులు వేస్తున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి.
తమిళనాడులో విజయ్ సాధించిన విజయమే ధనుష్ లాంటి వారు పాలిటిక్స్ లోకి వచ్చేందుకు స్ఫూర్తినిచ్చిందనే చర్చ జరుగుతోంది.తమిళనాడు రాజకీయ ల్యాండ్‌స్కేప్‌ను విజయ్ పూర్తిగా మార్చేశారు. ‘తమిళగ వెట్రి కజగం’-TVK పార్టీని స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 108 సీట్లు సాధించారు. పోస్ట్-పోల్ అలయెన్స్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఫిబ్రవరిలో టీవీకే పార్టీని ప్రకటించడానికి ముందు విజయ్ కూడా తన ఫ్యాన్ అసోసియేషన్ నెట్‌వర్క్‌ను ఇలాగే బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు ధనుష్ చేస్తున్న ప్రయత్నాలన్నీ సరిగ్గా విజయ్ ని ఫాలో అవుతున్నట్టే కనిపిస్తున్నాయి.
అయితే, రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇంతవరకూ నోరు విప్పలేదు. ఎప్పుడు అడిగినా తనదైన శైలిలో తప్పించుకుంటున్నారు.”మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా?” అని ధనుష్ ను ప్రశ్నించినప్పుడు, ఆయన కేవలం “హ్యాపీ దీపావళి” అని రెండు ముక్కల్లో సమాధానం దాటవేశారు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా, తన మౌనంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను మరింత పెంచారు. జూలై నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి ధనుష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ఐక్యతకు ఒక అర్థం ఉండాలని, కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా సామాజిక సేవ వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆయన ఇచ్చిన ఈ పిలుపును అందరూ రాజకీయ కోణంలోనే చూస్తున్నారు.
ధనుష్ రాజకీయ అడుగులను తమిళనాడు పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.ధనుష్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని అన్నాడీఎంకే మాజీ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ అన్నారు. మరోవైపు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ధనుష్ రాజకీయ ప్రవేశం వెనుక బీజేపీ ఉందని ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కొత్త రాజకీయాలను ప్రోత్సహించేందుకు బీజేపీ ‘ఆపరేషన్ డీ’ అనే వ్యూహాన్ని రచిస్తోందని కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగోర్ ఆరోపించారు. ధనుష్ మాత్రం తన కార్యాచరణను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతున్నారు.
సినిమా వేదికలపై సూపర్ హిట్స్ కొట్టిన ధనుష్.. రాజకీయ రణరంగంలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఇప్పుడే చెప్పలేం. అభిమానుల అంచనాలు, ప్రత్యర్థుల వ్యూహాల మధ్య ఆయన వేసే తదుపరి అడుగు తమిళనాడు రాజకీయ సమీకరణాలను శాసించే అవకాశం ఉంది.
:- CLN RAJU(EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!