Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి శరీరం ఇప్పుడు ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. మన గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటోంది, మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, ఎంత శక్తిని ఖర్చు చేస్తున్నాం.. ఇలా మన శరీరానికి సంబంధించిన ప్రతీ సమాచారానికి మార్కెట్లో ఒక ధర ఏర్పడుతోంది. ఆరోగ్యంపై మనుషుల్లో పెరుగుతున్న ఆందోళనను కొత్త వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. ఈ వ్యాపారానికి ఇప్పుడు సైన్స్ అనే ముసుగు కూడా తోడైంది. ఒకప్పుడు బాబాలు అద్భుతమైన వైద్య రహస్యాలు తమకు మాత్రమే తెలుసని చెప్పేవారు.
గతంలో రామ్‌దేవ్ బాబా కరోనా మందు పేరుతో తీసుకొచ్చిన కొరొనిల్ ఎంత దుమారానికి కారణమైందో గుర్తింది కదా..! ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా కరోనాకు విరుగుడు అంటూ ఆయన తీసుకొచ్చిన మందుపై డాక్టర్ల అసోసియేషన్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి డాక్టర్లు అదేస్థాయిలో ఓ ప్రొడక్ట్ విషయంలో అభ్యంతరం చెబుతున్నారు. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తీసుకొచ్చిన 85 వేల రూపాయల టెంపుల్ డివైజ్ చుట్టూ ఈ వివాదం మొదలైంది. ఇంతకీ ఏంటి టెంపుల్ డివైజ్..? దీనిపై డాక్టర్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు?
Also Read
నుదురు పక్కన అతికించుకునే చిన్న పరికరమే టెంపుల్ డివైజ్. దీని ద్వారా మెదడులో రక్తప్రసరణను గుర్తించవచ్చని గోయల్ అంటున్నారు. శరీరం ఎంత శ్రమిస్తోంది, ఎంత శక్తిని ఖర్చు చేస్తోందనే విషయాలను తెలుసుకోవచ్చని గోయల్ చెబుతున్నారు. అంతేకాదు, ఎంట్రోపీ అనే కొత్త జీవశాస్త్ర సూచికను కూడా ఈ పరికరం ద్వారా కొలవవచ్చని అంటున్నారు. వినడానికి ఇదొక అద్భుతమైన ఆవిష్కరణలా అనిపిస్తుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక ఆవిష్కరణ వినడానికి అద్భుతంగా ఉండటం వేరు. అది నిజంగా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపించడం వేరు.
ఇదే విషయంపై సిరియాక్ అబ్బీ ఫిలిప్స్, జేసన్ ఫిలిప్, రిషభ్ జైన్ లాంటి డాక్టర్లు ప్రశ్నలు లేవనెత్తారు. కంపెనీ చెబుతున్న ఆరోగ్య ప్రయోజనాలకు స్వతంత్ర పరిశోధనల మద్దతు ఎంతవరకు ఉందన్నదే వారి ప్రధాన అభ్యంతరం. గోయల్ బృందం కొన్ని ప్రారంభ పరిశోధనలు నిర్వహించినప్పటికీ, వాటితోనే ఈ పరికరం వైద్యపరంగా కచ్చితమైనదని తేల్చలేం. మరిన్ని పరిశోధనలు, ఇతర శాస్త్రవేత్తల ధ్రువీకరణ అవసరం. మరోవైపు పీవీ సింధు, శుభ్‌మన్ గిల్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారనే ప్రచారం కూడా దీనిపై ఆసక్తిని పెంచుతోంది. కానీ ఒక సెలబ్రిటీ ఒక పరికరాన్ని ఉపయోగించడం దాని శాస్త్రీయతకు ధ్రువీకరణగా మారదు. ప్రముఖుల పేరు వ్యాపారానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన వాదనలకు మాత్రం పరిశోధనలే ఆధారం కావాలి.
ఈ వ్యవహారంలో బాబా రామ్‌దేవ్ కరోనిల్ వివాదం కూడా గుర్తుకొస్తుంది. రెండింటి వాదనలు వేర్వేరు అయినప్పటికీ, నిరూపితమైన ఆధారాల కంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రజలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంటుంది. కొత్త సాంకేతికత రావడం మంచిదే. వ్యాపారం చేయడమూ సహజమే కానీ ఆరోగ్యం పేరుతో ప్రజలకు ఏం చెబుతున్నామన్నది ముఖ్యం. ఒక శాస్త్రీయ పదాన్ని పరిచయం చేసి, దానికి ఒక సంఖ్య ఇచ్చి, వేల రూపాయలకు పరికరాన్ని అమ్మడం సులభం.
ఆ సంఖ్య నిజంగా మన శరీరం గురించి ఏం చెబుతోందో నిరూపించడం మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే సైన్స్ అంటే ప్రచారం కాదండి.. ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే పరిశోధన. ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపార ప్రయోగంగా మార్చకుండా, ప్రతి వాదనకు తగిన ఆధారాలు చూపించాల్సిన బాధ్యత ఉత్పత్తిని తయారు చేసిన వారిపైనే ఉంది.
తాజావార్తలు
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
-
Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్ తప్పేమీ లేదు.. ఇదేం కొత్తేమీ కాదు!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
ట్రెండింగ్
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!