ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తమ కంపెనీలో ఉండే వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ జనవరి 8 నుండి ప్రారంభమవగా..అప్లయ్ చేయడానికి చివరి తేదీ జనవరి 23,2024. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు..
గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి నిర్ణయించబడింది. 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం కూడా రూ.70 వేల వరకు ఉంటుంది. అప్లికేషన్ తర్వాత దీని కోసం ఒక పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ఫిబ్రవరి నెలలో నిర్వహించబడుతుందని అంచనా వేయబడింది.. అందుకే పరీక్షకు కూడా ప్రీపేర్ అవ్వడం మంచిది..
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ uiic.co.in ని సందర్శించాలి. దాని హోమ్ పేజీలో ఇక్కడ లేటెస్ట్ అప్ డేట్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత UIIC అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 రిక్రూట్‌మెంట్ 2024పై క్లిక్ చేయాలి. తదుపరి పేజీలో ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌పై క్లిక్ చేయండి. ముందుగా ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత ఫామ్ ను ఫిల్ చేసి అప్లై చేసుకోండి.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకొనేందుకు అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..