తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న ‘టీఎస్ ఈఏపీసెట్-2024 ఫిబ్రవరి 21 న బుధవారం విడుదల చేసింది.. ఈ పరీక్షలకు అర్హత కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ గుర్తించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. రూ.250 ఆలస్య రుసుమతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలోనే విద్యార్థులు తమ పూర్తి సమాచారాన్ని అప్లై చెయ్యాల్సి ఉంటుంది..
ఇక మే లో పరీక్షలు జరగనున్నాయి.. మే 9 నుంచి 12 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను విద్యార్థులు మే 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 9, 10 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు; మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.. రెండు షిఫ్ట్ లలో పరీక్షలు జరగనున్నాయి..ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్లో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు..
దరఖాస్తు ఫీజు..
*.టీఎస్ ఎప్సెట్-2024 పరీక్షకు సంబంధించి ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి.
*. టీఎస్ ఎప్సెట్-2024 పరీక్షకు సంబంధించి ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి.
*. టీఎస్ ఎప్సెట్-2024 పరీక్షకు సంబంధించి రెండింటికి (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి.
*. టీఎస్ ఎప్సెట్-2024 పరీక్షకు సంబంధించి రెండింటికి (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి..
ఈ పరీక్షల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే https://eamcet.tsche.ac.in/ ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు..