నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1300 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది… ఈ నెల 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభమై మార్చి 29, 2024 కొనసాగనుంది. దరఖాస్తుదారులందరూ ఎస్ఎస్ఈ జూనియర్ ఇంజనీర్ దరఖాస్తు ఫారమ్ ఆన్‌లైన్ ద్వారా గడువు తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు..
దరఖాస్తుదారులు భారతీయ పౌరుడై ఉండాలి..అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన వారికి వయో సడలింపులు. దరఖాస్తుదారు సివిల్, మెకానికల్, ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు బి.టెక్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయసు..
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి.. మిగిలిన వాళ్లకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది..
జీతం..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు వేతనాన్ని పొందవచ్చు. జూనియర్ ఇంజనీర్ పోస్ట్‌తో అనుసంధానమైన అదనపు అలవెన్సులు కూడా పొందవచ్చు..
అవసరమైన డాక్యుమెంట్స్..
ఆధార్ కార్డ్ నంబర్
మొబైల్ కాంటాక్టు నంబర్
ఇమెయిల్ ఐడీ
10వ తరగతి మార్కుషీట్
12వ తరగతి మార్క్‌షీట్
డిప్లొమా డిగ్రీ
డిగ్రీ సర్టిఫికేట్
అభ్యర్థుల పాస్‌పోర్ట్ సైజు ఫోటో
స్కాన్ చేసిన అభ్యర్థి సిగ్నేచర్
ఎంపిక ప్రక్రియ..
ఎస్ఎస్ఈ జేఈ పరీక్ష ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
కంప్యూటర్ ఆధారిత వైద్య పరీక్ష
మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఎస్ఎస్ఈ అధికారిక (https://ssc.nic.in/) వెబ్‌సైట్‌ను సందర్శించండి.
SSC JE 2024 రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
‘కొత్త యూజర్’ లేదా ‘ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను సమర్పించండి.
దరఖాస్తు ఫారమ్‌లోని అన్ని ఫీల్డ్‌లను నింపండి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
అవసరమైన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, ఆపై మీ డివైజ్‌లో రసీదుని డౌన్‌లోడ్ చేసుకోండి..
ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..