SBI Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకులో 2వేల ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు..
ఖాళీల వివరాలు..
Also Read
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
- Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
మొత్తం ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 2000 ఉండగా.. కేటగిరీల వారీగా చూస్తే..
ఎస్సీ- 300,
ఎస్టీ- 150,
ఓబీసీ- 540,
ఈడబ్ల్యూఎస్- 200,
యూఆర్- 810..
వయో పరిమితి..
ఏప్రిల్ 1, 2023 నాటికి 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. అదే సమయంలో 30 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్ తదితరులకు ఐదేళ్లు చొప్పున వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
బ్యాంకు పీవో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపడతారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు..
జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు నాలుగు సార్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. జనరల్ (పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్ (పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులు, ఓబీసీ, ఓబీసీ పిడబ్ల్యూబీడీ) అభ్యర్థులైతే ఏడు సార్లు రాసేందుకు ఛాన్స్ ఉంది. అదే ఎస్సీ/ఎస్సీ పీడబ్ల్యూబీడీ/ఎస్టీ/ఎస్టీపీడబ్ల్యూబీడీ) అభ్యర్థులకు ఎన్నిసార్లయినా రాయొచ్చు.
దరఖాస్తు ఫీజు..
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు ఉంటుంది.
నవంబర్‌లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష; డిసెంబర్/జనవరిలో ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష; జనవరి/ఫిబ్రవరిలో సైకోమెట్రిక్, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి/మార్చిలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది..
జీతం..
ఉద్యోగాలకు ఎంపికైన వారికి బేసిక్ పే రూ.41,960 (ఇతర సౌకర్యాలు అదనం)
ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వాళ్లు నోటిఫికేషన్ ను బాగా చూసి అప్లై చేసుకోగలరని మనవి..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!