POWERGRID RECRUITMENT : పవర్ గ్రిడ్ లో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ప్రముఖ పవర్ కార్పొరేషన్ సంస్థ పవర్ గ్రిడ్ లో భారీగా ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది.. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ కార్యాలయాల్లో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 425 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, బీఎస్సీతో పాటు గేట్-2024 పరీక్షకు హాజరవుతున్నవారు అర్హులు.. 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ (పవర్), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, పవర్ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్,కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. అంతేకాదు గేట్ 2024 లో మంచి స్కోర్ చేసి ఉండాలని తెలిపారు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
వయస్సు..
అభ్యర్ధుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి..
ఎంపిక ప్రక్రియ..
గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.40,000 స్టైపెండ్ అందజేస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఇంజినీర్ ఈ-2 హోదాలో పీజీసీఐఎల్ పరిధిలోని నార్తర్న్, ఈస్ట్రన్, నార్త్- ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిశా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది..
జీతం..
ఈ ఉద్యోగాల్లో చేరిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు జీతంగా చెల్లిస్తారు..
2024 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 18, 2024 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. ఇకపోతే రూ.500. చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.. ఇక ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే..పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.powergrid.in/ పరిశీలించగలరు…
తాజావార్తలు
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!