ఇటీవల ఏఐ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి స్మార్ట్ చాట్‌బాట్‌లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందుకు అనువుగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఎన్నో రీసెర్చ్ లు చేస్తున్నాయి.. ఇక ఏఐ గురించి ప్రత్యేకంగా చెప్పనర్లేదు.. రోజురోజుకు దూసుకుపోతుంది.. అనేక పెద్ద కంపెనీలు సైతం ఏఐ తో అనుసంధానం కలిగి ఉంటున్నాయి.. ఏఐకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం) నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న టెకీల చదువు, పూర్వ పని అనుభవంతో సంబంధం లేకుండా కంపెనీలు అవకాశాలు ఇస్తున్నాయి..
ఈ శిక్షణ వల్ల నిరుద్యోగులతో పాటు , ఉద్యోగులకు కూడా మంచి భవిష్యత్ ఉంటుందనే ఉదేశ్యంతో కొన్ని ప్రముఖ కంపెనీలు శిక్షణను ఇస్తున్నాయి.. ఈ మేరకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏఐ ఒడిస్సీ ప్రోగ్రామ్‌తో దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ప్రోగ్రామ్ నెల రోజుల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటిదశలో అజూర్ ఏఐ సర్వీస్‌లకు సంబంధించిన మెలకువలు నేర్పుతారు.. ఎలా చెయ్యాలో, ఏఐ గురించి పూర్తి సమాచారం గురించి చెబుతారు..
అదే విధంగా రెండో దశలో ఏఐ గురించి ప్రాక్టీకల్స్ చేపిస్తారు.. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారు మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని ఏఐ రియల్‌టైమ్ సమస్యలపై పనిచేసేందుకు వీలుంటుంది. దాంతోపాటు ఫిబ్రవరి 8న బెంగళూరులో జరగబోయే మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు…
ఈ శిక్షణ కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే?
*. ముందుగా aka.ms/AIOdyssey లింక్‌పై క్లిక్ చేయాలి.
*. ఆ తర్వాత అవసరమైన వివరాలను అందులో నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
*. అలా నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత లెర్నింగ్ మాడ్యూల్స్‌కు యాక్సెస్ పొందుతారు. అందులో లాగిన్ అవ్వాలి.
*.ప్రోగ్రామ్ మొదటి దశలో అజూర్ ఏఐ సర్వీస్‌లను ఎలా ఉపయోగించాలో ఉంటుంది.
*.రెండో దశలో ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఇస్తారు.. దాన్ని పూర్తి అవగాహన తో పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.. అంతే ఇలా శిక్షణ పూర్తి అవుతుంది..