ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. వరుసగా పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1603 టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 5వ 2024…
అర్హతలు..
12th/ ITI/ డిప్లొమా/ B.A/ B.Com/ B.Sc/ BBA ఉత్తీర్ణత మస్ట్. ఆసక్తి మరియు అర్హత గల దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ iocl.com సందర్శించి 5 జనవరి 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు..
వయో పరిమితి..
18 నుండి 24 సంవత్సరాలు.. వయస్సు సడలింపు,OBC అభ్యర్థులు 3 సంవత్సరాలు,SC/ST అభ్యర్థులు 5 సంవత్సరాలు,PWD (జనరల్) అభ్యర్థులు: 10 సంవత్సరాలు,PWD (OBC) అభ్యర్థులు: 13 సంవత్సరాలు,PWD (SC/ST) అభ్యర్థులు: 15 సంవత్సరాలు ఉంటుంది..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 5 జనవరి, 2024.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..