నిరుద్యోగులకు ఇండియన్ నేవి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేవిలో ఖాళీ ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. నేవీకి సంబంధించిన కార్యాలయాల సిబ్బందితోపాటు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే పోస్ట్‌లను కూడా భర్తీ చేస్తారు. తాజా నోటిఫికేషన్‌లో పోస్ట్‌లను నాన్-మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ అనే పేరుతో రెండు కేటగిరీలుగా పేర్కొన్నారు.. ఈ పోస్టులకు అర్హతలను, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య – 910
నాన్ మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలలో మొత్తం 910 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గ్రూప్ బీలో చార్జ్‌మెన్ వర్క్‌షాప్ 22 పోస్టులు, చార్జ్‌మెన్ 20 పోస్టులు, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ 258 పోస్టులు; అదేవిధంగా గ్రూప్ ట్రేడ్స్‌మెన్ మెట్ 610 పోస్టులు ఉన్నాయి..
అర్హతలు..
పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి..
వయోపరిమితి..
ఈ పోస్టులకు సంబందించి ఒక్కో పోస్టుకు ఒక్కో వయస్సు ఉంటుంది.. 18-25 ఏళ్లు, 18-27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున సడలింపు కూడా ఉంటుంది..
ఎంపిక విధానం..
ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో సాధించిన మార్కులు, అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరిట సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.అదే సమయంలో వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు.. ఆ తర్వాత నేవికి పనికి సరిపోగలరా లేదా అని చూస్తారు..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://incet.cbt-exam.in/login/యూసర్ ను పరిశీలించగలరు.. పరీక్షల గురించి సందేహాలు ఉంటే గతంలో జరిగిన పరీక్షల పేపర్లను పరిశీలించగలరు..