తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను వదులుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈసీఐఎల్ హైదరాబాద్ లో 363 అప్రెంటిస్ పోస్టుల ను విడుదల చేసింది.. గతంలో విడుదల చేసిన పోస్టుల కన్నా ఈ ఏడాది పోస్టులను ఎక్కువగా విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఆసక్తి, అర్హతలు ఉన్న వాళ్లు ఈరోజు ఆఖరి రోజు అప్లై చేసుకోవాలి.. వీటికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొత్తం ఖాళీల సంఖ్య..363
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్- 250, డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటిస్-113..
ట్రేడులు..
ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, ఈఐఈ.
అర్హతలు..
సంబంధిత విభాగం లో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు..
31.12.2023 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్..
నెలకు జీఈఏల కు రూ.9000, టీఏ అభ్యర్థుల కు రూ.8000. ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది..
ఎంపిక విధానం..
డిప్లొమా, బీఈ, బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం..
Ecil ఆఫీస్ , కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్..
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023
ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 21.12.2023, 22.12.2023…
ఈ పోస్టులపై ఏదైనా సందేహాలు ఉంటే అధికార వెబ్ సైట్: https://www.ecil.co.in/ ను పరిశీలించగలరు..