పేదల ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి: రామకృష్ణ

పేదల ఇళ్ల స్థలాలు.. ఇళ్ల నిర్మాణంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. రూ. 4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు.ఇళ్ల స్థలాల కొనుగోళ్ల విషయంలో ఓ ఎంపీని సీఎం జగన్‌ చెంప మీద కొట్టారని మాకు సమాచారముందన్నారు. ఈ ప్రభుత్వం పేదలకు కట్టించేవి ఇళ్లు కాదు.. పందుల గూళ్లుఅని సంచలన వ్యాఖ్యలు చేశారు.గ్రేటేడ్‌ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు కట్టిస్తున్నామంటూ సజ్జల ప్రజలను భ్రమల్లో ఉంచుతుతున్నారని పేర్కొన్నారు.

Read Also:జాతీయ స్థాయిలో అల్లూరికి గుర్తింపు రాలేదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పేదలకు కట్టించే ఇంటిలో సజ్జల తన కుటుంబంతో 24 గంటల పాటు ఉండగలరా..? తాడేపల్లిలో ప్రభుత్వం నిర్మించిన మోడల్‌ హౌస్‌ ఉంది.. అక్కడ సజ్జల 24 గంటలపాటు కుటుంబంతో ఉండగలరా..? ఇంటి సామాను మేమే లారీలో తరలిస్తాం. సీఎం జగన్‌ ఇంటి బాత్రూం కంటే పేదలకు ఇచ్చే ఇంటి స్థలం తక్కువగా ఉందని విమర్శించారు. పేదల ఇళ్ల కోసం పల్లెల్లో మూడు సెంట్లు.. అర్బన్‌లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అమరావతి పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కేటాయించకుండా ప్రభుత్వం సైంధవుని మాదిరిగా అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం డబ్బులివ్వాలని రైతులు ధర్నాలు చేస్తుంటే పొలం గట్టు మీదే డబ్బులిస్తున్నామని సజ్జల ఎలా చెబుతారు..?ఈ నెల 10వ తేదీన సీఎం క్యాంప్‌ కార్యాలయం ముట్టడి చేస్తామని పేర్కొన్నారు. పెన్షన్ల విషయంలో జగన్‌ మాట తప్పారు. రూ. 3 వేలు ఇస్తామన్న సీఎం జగన్‌.. నిన్నటి వరకు రూ. 2250 ఇచ్చారు.. ఇప్పుడు రూ. 2500 ఇస్తున్నారని ఆరోపించారు.

Related Articles

Latest Articles