Site icon NTV Telugu

Woman Kills Parents: ఇంత వైల్డ్గా ఉన్నారేంట్రా బాబు.. ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను హత్య చేసిన యువతి..!

Crime

Crime

Woman Kills Parents: వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డొస్తున్నారనే కోపంతో.. కన్న కూతురే తన తల్లిదండ్రులను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి, తన ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు అనస్థీషియా ఇంజెక్షన్ ను ఓవర్ డోస్ ఇచ్చి ప్రాణాలు తీసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు.

IND vs NZ 4th T20: అతడు నంబర్ 1 బౌలర్‌.. రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేయడం సరికాదు!

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, నిందితురాలు నక్కల సురేఖను అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు కారణమని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తూ, నిందితురాలిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

Political Leaders Plane Crashes: బల్వంత్‌రాయ్ మెహతా నుంచి అజిత్ పవార్ వరకు.. ప్లేన్, హెలికాప్టర్ క్రాష్‌లలో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ నాయకులు వీరే..!

Exit mobile version