Site icon NTV Telugu

Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం.. తరిమేసిన భర్త.. షాక్‌ ఇచ్చిన ప్రియుడు..

Vikarabad

Vikarabad

Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం తెలుసుకుని భర్త తరిమేశాడు…!! భర్తకు దూరమైన విషయం తెలిసి ప్రియుడు మరోసారి దగ్గరయ్యాడు !! భర్త వదిలేస్తేనేం నీకు నేనున్నాంటూ చేరదీశాడు. కానీ.. ఈసారి ఆ ప్రియుడు నమ్మించి వంచించాడు. శారీరకంగా వాడుకుని వదిలేశాడు. అటు భర్తకు దూరమై.. ఇటు ప్రియుడూ వదిలేసి.. ఏకాకిలా మారింది ఆ యువతి. చేసేది లేక న్యాయం కోసం తాండూరు పోలీసులను ఆశ్రయించింది యువతి. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం బెల్కటూరుకి చెందిన ఈ యువతి.. అదే గ్రామానికి చెందిన సురేష్‌ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీళ్ల ప్రేమ పెళ్లికి ఇరు
కుటుంబాలు నిరాకరించాయి. అక్షితకు ఉన్నఫలంగా కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం జరిపించారు ఆమె తల్లిదండ్రులు..

READ MORE: Hyderabad: ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ గలీజ్ దందా.. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం చౌర్యం..

ప్రియుడికి దూరమైనా… మంచిగా చూసుకునే భర్త దొరకడంతో సంతోషంగానే ఉంది యువతి. సాఫీగా సాగుతున్న యువతి జీవితంలోకి మళ్లీ ఎంటరయ్యాడు ప్రియుడు సురేష్‌. పెళ్లి జరిగిందని తెలిసినా కాల్స్‌ చేసి వేధించాడు. నిత్యం భార్యకు వస్తున్న కాల్స్‌ చూసి అనుమానం వచ్చిన భర్త ఆరా తీశాడు. భార్య ప్రేమాయణం అంతా తెలుసుకున్నాడు. అసలే… ప్రియుడు, భార్య కలిసి భర్తలను చంపుతున్న కాలమిది !! నాకొద్దు బాబోయ్‌ ఈ పెళ్లాం అంటూ భార్యను పుట్టింటికి పంపించేశాడు. పెద్దల సమక్షంలో తెగదెంపులు చేసుకున్నాడు. తిరిగి ఊర్లోకి వచ్చిన యువతిని చూసి.. సురేష్‌ దగ్గరయ్యాడు. భర్త వదిలేసిన విషయం తెలుసుకుని సానుభూతి చూపాడు. నా వల్లనే ఇలా జరిగింది కదా… ఐతే నీకు అండగా నేనున్నానంటూ మాయమాటలు చెప్పాడు. మాజీ ప్రియుడు సురేష్‌ మాటలను గుడ్డిగా నమ్మింది యువతి. భర్త వదిలేస్తే ఏంటి.. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను.. అంటూ ఆమెకు సురేష్‌ శారీరకంగా దగ్గరయ్యాడు.. ఉన్నట్టుండి కొన్ని రోజులుగా యువతిని దూరం పెడుతున్నాడు ప్రియుడు సురేష్‌. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి దాటవేస్తూ వచ్చాడు. దీంతో మరోసారి మోసపోయానని గ్రహించింది. పోలీసులను ఆశ్రయించింది. ప్రియుడు సురేష్‌ పై కరణ్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సురేష్‌ తనతో చనువుగా ఉన్న ఫొటోలను పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

READ MORE: Rajasaab : రాజాసాబ్ సెట్స్ లో పూరీ.. ప్రభాస్ లుక్స్ చూశారా

Exit mobile version