Delhi Crime: కాబోయే వాడితో కలిసి కన్నతల్లిని హతమార్చిన మహిళ..
- ఆస్తి కోసం కన్నకూతురు దారుణం..
- రాబోయే భర్తతో కలిసి తల్లి హత్య..
- నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Crime: ఆస్తి కోసం ఓ మహిళ దారుణానికి తెగబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కాబోయే భర్తతో, మరో స్నేహితుడితో కలిసి కన్న తల్లినే హతమార్చింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు పెద్ద నాటకానికి తెరతీసింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కన్న కూతురే నిందితురాలిగా తేల్చారు.
వివరాల్లోకి వెళ్తే.. నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో ఈ హత్య చోటు చేసుకుంది. కాబోయే భర్త, కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో ఒక మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితులను మోనికా, ఆమెకు కాబోయే భర్త నరేలా నివాసి అయిన నవీన్ కుమార్, హర్యానాకు చెందిన నవీన్ కుమార్ స్నేహితుడు యోగిష్ అలియస్ యోగిగా గుర్తించారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
Read Also: Kolkata Doctor Case: ఇంత అర్జెంట్ ఎందుకు..? ఆర్జీ కర్ ఆస్పత్రి పనులపై హైకోర్టు ప్రశ్న..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మహిళా కాలర్ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి, ఇంట్లో ఉన్న తన తల్లి స్పందించడం లేదని, పోలీసులు వెళ్లి తలుపు తీసి చూడాలని కోరింది. నజాఫ్‌గఢ్ మెయిన్ మార్కెట్‌లోని నివాస భవనంలోని నాల్గవ అంతస్తులో తన 58 ఏళ్ల తల్లి ఒంటరిగా నివసిస్తుందని మోనికా సోలంకిగా అనే మహిళ కాల్ చేసి చెప్పింది. ఒక రోజు ముందే ఆమె దగ్గరకు వెళ్లినట్లు , ఆమె బాగానే ఉందని చెప్పింది.
పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా లోపల బెడ్‌రూంలో నేలపై సుమిత్ర అనే మహిళ నుదిటిపై, కంటిపై, రెండు చేతులపై గాయాలతో విగతజీవిగా పడిఉంది. ఆమె నోటి వెంట రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నాయి. వెంటనే విచారించిన పోలీసులు భవనంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఒక మహిళలో పాటు మరో ఇద్దరు తెల్లవారుజామున 2.18 గంటల సమయంలో ఫ్లాట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. ఫుటేజీని స్పష్టంగా పరిశీలించగా ఫ్లాట్‌లోకి వెళ్తున్న వారిని హత్య చేయబడిన సుమిత్ర కుమార్తె మోనికాగా మరో ఇద్దర్ని నవీన్, యోగేష్‌గా గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
- Tags
- crime
- Crime News
- Delhi
- delhi crime
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..