AP Crime: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.. పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్నవారిని సైతం కాటికి పంపిస్తున్నారు.. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు మరీ ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.. తాజాగా, గుంటూరు జిల్లాలోనూ వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ వివాహిత.. అయితే, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో సంచనల అంశాలు వెలుగు చూశాయి..
Read Also: Chiranjeevi : అనిల్ రావిపూడి చిరు మూవీలో మరో మెగా హీరో..!
ఈ కేసులో తెనాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు వెల్లడించిన విషయాల్లోకి వెళ్తే.. గత నెల 26న తెనాలి రూరల్ మండలం మల్లెపాడులో పృథ్వీరాజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు.. అయితే, ఐదేళ్ల క్రితం వెంకటలక్ష్మితో పృధ్వీరాజ్ కు వివాహం జరిగింది.. వెంకటలక్ష్మికి మొదటి భర్త చనిపోవడంతో పృధ్వీరాజ్ తో రెండోపెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు.. ఇక, ఉపాధి కోసం బెంగుళూరు వెళ్లారు దంపతులు. అయితే, బెంగుళూరులో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మికి పరిచయం ఏర్పడింది.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.. మరోవైపు, కొన్నిరోజుల బెంగుళూరులో ఉండలేక తెనాలి వచ్చి ఆటోనడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు పృథ్వీరాజ్.. కానీ, కొన్నాళ్లపాటు బెంగుళూరులో కోటేశ్వరరావుతోనే ఉండిపోయింది వెంకటలక్ష్మి. మద్యంతాగి కొడుతుండడంతో తిరిగి భర్త వద్దకు వచ్చింది..
Read Also: CM Chandrababu: ప్రధాని మోడీకి కృతజ్ఞతాపూర్వక స్వాగతం..
అయితే, తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను లేపేస్తే.. తమకు అడ్డుఉండదని కోటేశ్వరరావుతో కలిసి ప్లాన్ చేసింది వెంకటలక్ష్మి.. తమ ప్లాన్‌లో భాగంగా కోటేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడుతూ అన్నయ్య అంటూ భర్త పృథ్వీరాజ్‌కు పరిచయం చేసింది వెంకటలక్ష్మి.. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయడానికి ప్రణాళికలు వేశారు.. తెనాలి వచ్చి మద్యం తాగుదామంటూ పృథ్వీరాజ్ ను బయటకు తీసుకెళ్లిన కోటేశ్వరరావు.. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత కత్తితో పొడిచి.. రాయితో తలపై కొట్టి హత్య చేశాడు.. మొదట హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.. ఇదే సమయంలో.. పృథ్వీరాజ్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.. కోడలిపైనే అనుమానం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు పృథ్వీరాజ్ తండ్రి.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.. తనదైన స్టైల్‌లో విచారణ జరపగా.. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..