Crime News: మరో ఘటన.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- అనంతపురం నగర సమీపంలో ఘటన..
- ఆరు గంటల్లోపు నిందితులను పట్టుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఈ మధ్య ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవారినే కాటికి పంపుతున్నారు కొందరు మహిళలు.. వరుస ఘటనలతో.. అసలు పెళ్లి చేసుకోవాలంటేనే వణుకిపోతున్నామంటూ.. కొందరు యువత సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. అనుమానం ఉన్న మరికొందరు కూడా.. భయంతో వణికిపోతున్నారట.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘటన వెలుగు చూసింది.. అనంతపురం నగర సమీపంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను ఆరు గంటల్లోపు పోలీసులు పట్టుకున్నారు పోలీసులు.. ఇవాళ ఉదయం రాచనాపల్లి సమీపంలో కుమ్మర సురేష్ బాబు దారుణ హత్యకు గురయ్యాడు.. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సురేష్ బాబు భార్య అనితను, ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: V Hanumantha Rao: భర్త కోసం యమధర్మరాజుతో కూడా కొట్లాడిన భార్యలను చూశా.. కానీ ఇప్పుడు..
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు డీఎస్పీ వెంకటేశులు.. కళ్యాణదుర్గం రోడ్ లో సురేష్ బాబు, అనిత హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం అనితకు ఫక్రుద్దీన్ అనే ఒక పండ్లు అమ్ముకునే వ్యక్తి పరిచమయ్యాడు. అది వివాహేతర సంబంధం గా మారింది. ఈ విషయంలో సురేష్ బాబుకు అనుమానం రావడంతో మద్యం సేవించి అనితను వేధించసాగాడు. తమ సంబంధానికి భర్త సురేష్ బాబు అడ్డుగా ఉన్నాడని ఫక్రుద్దీన్ తో అని చెప్పింది. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకుంటే సంతోషంగా ఉండవచ్చని హత్యకు ఉసిగొల్పింది.. దీంతో ఫక్రుద్దీన్ గత రాత్రి సురేష్ బాబు హోటల్ మూసివేసి.. ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఖాళీ సీసాతో విసిరి దాడి చేశాడు. వెంటనే కింద పడ్డ సురేష్ బాబుని స్క్రూ డ్రైవర్ తో పొడిచే ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశాడు. అనంతపురం పరిధిలో రెండు రోజుల్లో వరుసగా రెండు హత్యలు జరగడంతో ఈ కేసును ఎస్పీ జగదీష్ బాబు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి వెంకటేశులు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోని ఈ హత్య జరిగిందని ఆయన వెల్లడించారు…
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!