Site icon NTV Telugu

Crime News: మరో ఘటన.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

Anantapur

Anantapur

Crime News: ఈ మధ్య ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవారినే కాటికి పంపుతున్నారు కొందరు మహిళలు.. వరుస ఘటనలతో.. అసలు పెళ్లి చేసుకోవాలంటేనే వణుకిపోతున్నామంటూ.. కొందరు యువత సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. అనుమానం ఉన్న మరికొందరు కూడా.. భయంతో వణికిపోతున్నారట.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘటన వెలుగు చూసింది.. అనంతపురం నగర సమీపంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను ఆరు గంటల్లోపు పోలీసులు పట్టుకున్నారు పోలీసులు.. ఇవాళ ఉదయం రాచనాపల్లి సమీపంలో కుమ్మర సురేష్ బాబు దారుణ హత్యకు గురయ్యాడు.. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సురేష్ బాబు భార్య అనితను, ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: V Hanumantha Rao: భర్త కోసం యమధర్మరాజుతో కూడా కొట్లాడిన భార్యలను చూశా.. కానీ ఇప్పుడు..

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు డీఎస్పీ వెంకటేశులు.. కళ్యాణదుర్గం రోడ్ లో సురేష్ బాబు, అనిత హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం అనితకు ఫక్రుద్దీన్ అనే ఒక పండ్లు అమ్ముకునే వ్యక్తి పరిచమయ్యాడు. అది వివాహేతర సంబంధం గా మారింది. ఈ విషయంలో సురేష్ బాబుకు అనుమానం రావడంతో మద్యం సేవించి అనితను వేధించసాగాడు. తమ సంబంధానికి భర్త సురేష్ బాబు అడ్డుగా ఉన్నాడని ఫక్రుద్దీన్ తో అని చెప్పింది. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకుంటే సంతోషంగా ఉండవచ్చని హత్యకు ఉసిగొల్పింది.. దీంతో ఫక్రుద్దీన్ గత రాత్రి సురేష్ బాబు హోటల్ మూసివేసి.. ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఖాళీ సీసాతో విసిరి దాడి చేశాడు. వెంటనే కింద పడ్డ సురేష్ బాబుని స్క్రూ డ్రైవర్ తో పొడిచే ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశాడు. అనంతపురం పరిధిలో రెండు రోజుల్లో వరుసగా రెండు హత్యలు జరగడంతో ఈ కేసును ఎస్పీ జగదీష్ బాబు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి వెంకటేశులు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోని ఈ హత్య జరిగిందని ఆయన వెల్లడించారు…

Exit mobile version