Wife Killed Husband With Help Of Love In Bangalore: వాళ్లు భార్యాభర్తలు. పెళ్లై చాలా సంవత్సరాలే అవుతోంది. అయితే ఒకరికొకరు తెలియకుండా వేరే వాళ్లతో ఎఫైర్స్ పెట్టుకున్నారు. రహస్యంగానే తమ రాసలీలలు కొనసాగించారు. చివరికి భార్య ఎఫైర్ గురించి భర్తకి తెలిసింది. అతడు నిలదీయడం, భార్య కూడా రివర్స్ అవ్వడంతో.. వ్యవహారం క్రైమ్ సీన్ దాకా వెళ్లింది. ఒకరు చనిపోవాల్సి వచ్చింది. క్రైమ్ త్రిల్లర్ సినిమాని తలపించే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
రాకేశ్ తోమంగ, దేబి తంబాగ్‌కు చాలాకాలం క్రితం వివాహం అయ్యింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఈ దంపతులు బెంగళూరులో సెటిల్ అయ్యారు. అయితే.. వీళ్లు రహస్యంగా ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. భర్త పరాయి మహిళతో రాసలీలలు కొనసాగిస్తే, భార్య ఇంటి వద్ద ఉండే మరో బాబు అలీ అనే వ్యక్తితో ఇంట్లోనే ఎఫైర్ నడిపింది. భర్త లేనప్పుడు దేబి తన ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకునేది. అయితే.. ఒకరోజు దేబి తన ప్రియుడితో అడ్డంగా బుక్కైంది. ఇంట్లో వాళ్లు కామక్రీడలో మునిగి ఉండగా, భర్త పట్టుకున్నాడు. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అటు.. బాబు అలీకి కూడా వార్నింగ్ ఇచ్చాడు.
దీంతో.. రాకేశ్ తోమంగ్ అడ్డు తొలగించుకోవాలని దేబి, బాబు ప్లాన్ వేశారు. పథకం ప్రకారం.. ఈనెల 6వ తేదీన రాకేశ్ రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో ఉన్న బాబు అలీ, అతనిపై దాడి చేశాడు. భార్య కూడా ప్రియుడితో కలిసి భర్తని చితకబాదింది. ఈ దాడిలో రాకేశ్ చనిపోయాడు. ఈ హత్యను దాచేందుకు వాళ్లిద్దరు గట్టిగానే ప్రయత్నించారు కానీ, చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం వీళ్లు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.