Teacher Killed: వీడిన మిస్టరీ.. తమ్ముడితో కలిసి భార్య ఆ పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 14వ తేదీన జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె తమ్ముడు కూడా ఇందుకు సహకరించడం మరో షాకింగ్ విషయం. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే..
నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్.. బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనాతో వివాహమైంది. వీరికి తమీమ్, ఆర్పియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న వీరి సంసార జీవితంలోకి మహబూబ్ బాషా అనే వ్యక్తి వచ్చాడు. అతనితో హసీనా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన హేసేన్.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. గ్రామ పెద్దలు మహబూబ్ బాషాను మందలించి, గ్రామం నుంచి హుసేనాపురం పంపించారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
అయినా.. హసీనా, మహబూబ్‌బాషాల తీరు మారలేదు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించిన హుసేన్.. భార్యను వేధించాడు. దీంతో, భర్తను అడ్డు తొలగించుకోవాలని హసీనా నిర్ణయించుకుంది. తన తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్‌బాషాతో కలసి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల్ని తన తల్లి ఇంటికి పంపించింది. గత నెల 13వ తేదీన హుసేన్ ఇస్తమాకు వెళ్లి, రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటిపైన ఇద్రూస్, మహబూబ్ బాషా ఉన్నారు. హుసేన్ నిద్రలోకి జారుకోగా.. ముగ్గురు కలిసి అతని గొంతునొక్కి చంపేశారు.
ఆ తర్వాత అనుమానం రాకుండా హుసేన్ ఆస్తమాతో ఊపిరాడక చనిపోయాడని హసీనా సమాచారం ఇచ్చింది. వైద్యులు కూడా అతడు ఊపిరాడక పోవడం వల్లే చనిపోయాడని ధృవీకరించారు. అయితే.. తన అన్నకు ఆస్తమా ఉన్నా, మందులు సక్రమంగా వాడుతున్నాడని, ఆ సమస్యతో అతను చనిపోలేదని, ఇతర కారణాలున్నాయన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక మేరకు దర్యాప్తు చేయగా, తమ్ముడు & ప్రియుడతో కలిసి భార్యే హుసేన్‌ను చంపినట్టు తేల్చారు.

తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!