ఇంటర్నెట్ లోనే కాదు బహిరంగ ప్రదేశాల్లోనూ అశ్లీలత పెచ్చుమీరుతోంది. ఆపాల్సిన పోలీసులు దగ్గరుండి అశ్లీల డ్యాన్స్ లు వేయించడం వివాదాలకు దారితీసింది. అమ్యామ్యాలు పుచ్చుకొని చేజర్ల పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో అర్థరాత్రి వేళ చేజర్ల పోలీసుల సాక్షిగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ఈ అశ్లీల నృత్యాలు రాజ్యమేలాయి. పోలీసులు ప్రభుత్వ ఆంక్షలని సైతం తుంగలో…