Crime News: భార్యను కాపురానికి పంపని అత్తను.. దారుణంగా హత్య చేసిన అల్లుడు
- విజయవాడలోని సింగ్ నగర్‌లో దారుణం..
- భార్యను తనతో కాపురానికి పంపాలని కోరిన అల్లుడు..
- తన కూతుర్ని పంపడానికి ఒప్పుకోని అత్త.. కోపంతో కత్తితో దాడి..
- చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయిన కోలా దుర్గ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: విజయవాడలోని సింగ్ నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే.. సింగ్ నగర్‌కు చెందిన కోలా దుర్గను ఆమె అల్లుడు నాగసాయి భార్యను తనతో కాపురానికి పంపాలని కోరగా, అత్త ఇందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర కోపానికి గురైన నాగసాయి అత్త ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కోలా దుర్గ తీవ్రంగా గాయపడగా, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Also: Funny Cricket Moment: మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిధి..
Also Read
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
ఇక, నిందితుడు నాగసాయి స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, నాగసాయిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, నాగసాయిపై గతంలోనే అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో సింగ్ నగర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!