Vijayawada: సిటీలో టెన్షన్.. విజయవాడలో వందల బైకులతో రౌడీషీటర్ల ర్యాలీ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలో రౌడీషీటర్లు హల్‌చల్ చేశారు. కృష్ణలంక రౌడీషీటర్ పండు అలియాస్ పావురం అంతిమయాత్రను సిటీలో ఓ రేంజ్‌లో నిర్వహించారు. అంతే కాదు.. వందల కొద్ది మంది రౌడీషీటర్లు రోడ్ల మీదకు వచ్చి ర్యాలీ చేయడం.. సిటీలో అలజడి రేపింది. దీంతో ఈ ఊరేగింపును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. విజయవాడ రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో నడుపుతూ యాక్సిడెంట్లో మృతి చెందాడు. ఐతే అతని అంత్యక్రియలను తోటి రౌడీషీటర్లు అత్యంత ఘనంగా నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి భవానీపురం పొలం వరకు ర్యాలీగా అంతిమయాత్ర జరిగింది. ఇందులో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. అంతే కాదు సింగ్ నగర్ ఎల్బీఎస్ నగర్‌కు చెందిన బల్జిద్, పటేల్ నగర్‌కు చెందిన బాజీ, జక్కంపూడికి చెందిన శంకర్‌తో పాటు బ్లేడ్ బ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించే శివయ్య అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరితోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన బ్లేడ్ బ్యాచ్ సస్పెక్ట్ షీటర్లు పాల్గొన్నారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు.
READ MORE: Ragi Halwa Recipe: నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే టేస్టీ,హెల్తీ బెల్లం రాగి హల్వా..
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
ఈ వీడియోలు వైరల్‌గా మారటంతో పోలీసులు మొత్తం వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. పావురం మృతికి సంబంధించి నిర్వహించిన ర్యాలీ ఘటనపై విచారణ చేపట్టారు. అంతమయాత్ర నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన కారణంగా కొందరిని అరెస్ట్ చేసి DJ వాహనాన్ని, 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. అదేవిధంగా స్థానికుల ఫిర్యాదు మేరకు కృష్ణలంకకు చెందిన నవీన్ సాయి సూర్య కోడి మరికొందరిపై కేసు నమోదు చేశారు. పలువురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి అందులో పాల్గొన్న వారు రౌడీషీటర్లు ఉంటే వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు..
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!