Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.!
- వాలెంటైన్స్ పేరుతో ఫిషింగ్ లింక్స్ వల
- ఫేక్ ప్రొఫైల్స్‌తో గిఫ్ట్ స్కామ్‌లు
- పార్సిల్, ఆఫర్ల పేరుతో డబ్బుల దోపిడి
- వీడియో కాల్ బ్లాక్‌మెయిల్‌లపై పోలీసుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాలెంటైన్స్ డేకు సైబర్ క్రిమినల్స్ కూడా రెడీ అయిపోయారు..!! అదేంటీ.. వాలెంటైన్స్ డేకు సైబర్ క్రిమినల్స్ రెడీ అయ్యారని ఆలోచిస్తున్నారా? అంటే.. వారు కూడా లవ్ చేస్తారని కాదు..!! వాలెంటైన్ డే కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారిని సైబర్ లింకులతో బురిడీ కొట్టిస్తారు.. ఖాతాలు ఖాళీ చేస్తారు. ఈ క్రమంలో ఫిష్షింగ్ లింక్స్‌పై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిజమైన ప్రేమికుల సంగతి అటు పక్కకు పెడితే.. వాలెంటైన్స్ డే కోసం సైబర్ క్రిమినల్స్ సైతం రంగంలోకి దిగారు. ప్రేమికుల సందడి పెరుగుతున్న వేళ.. సైబర్ నేరగాళ్ల చలనం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.. ప్రేమికుల కోసం వెతుక్కునే వారే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు.
ఇందులో భాగంగా గిఫ్ట్ ఆఫర్లు, డేటింగ్ అండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఫేక్ ప్రొఫైల్స్ పంపిస్తూ వల విసురుతున్నారు. అంతే కాదు స్మార్ట్‌గా లక్షల రూపాయలు దోచేస్తున్నట్లు పలు కేసులు పోలీసుల దృష్టికి వస్తున్నాయి.. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఆకర్షణీయమైన ఫొటోలతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ముందుగా స్నేహం పెంచుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. కొన్ని రోజుల చాట్ తర్వాత గిఫ్ట్ పంపాను.. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు పంపాలి.. అంటూ బాధితుల్ని నమ్మిస్తారు. విదేశాల నుంచి పార్సిల్ వస్తోందని చెప్పి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
Imran Khan: ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ పీఎం..
ఇలాంటి మోసాలే కాదు.. వాలెంటైన్ స్పెషల్ కాంబో, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ముందుగానే చెల్లింపులు తీసుకుంటున్నారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన వెంటనే వెబ్‌సైట్ మాయమవుతోంది. రిఫండ్ కోసం సంప్రదిస్తే నాట్ రెస్పాండ్ మెసేజ్ ప్రత్యక్షమవుతుంది.. మరోవైపు సైబర్ క్రిమినల్స్ మరో తరహా మోసానికి సైతం తెరలేపుతున్నరు. కొంతమంది యువతతో స్నేహం పెంచుకుని వీడియో కాల్‌కు ఆహ్వానిస్తారు. వ్యక్తిగతంగా ఉన్న వీడియోలను రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు…
సో.. వాలెంటైన్స్ వేళ యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని చెబుతున్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దంటున్నారు. ముందస్తు చెల్లింపులు చేయడానికి ముందు వెబ్‌సైట్ నిజస్వరూపం తెలుసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ ప్రయివేట్ వీడియోలతో ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేసినట్లయితే భయపడకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.. ఆకర్షణీయమైన ఆఫర్లు, అతి తక్కువ ధరలు, త్వరగా డబ్బు పంపమని ఒత్తిడి చేయడం లాంటివి చేస్తే.. వాటిని కచ్చితంగా మోసంగానే గుర్తించాలంటున్నారు పోలీసులు..
Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!
తాజావార్తలు
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!