Uttar Pradesh: ఆటోను ఢీకొట్టి బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్..9 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*-ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది.. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని లీలాపూర్ ప్రాంతంలో ఆటోను గ్యాస్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా తొమ్మిది మంది మృతి చెందారు.. లారీ అతి వేగం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..
ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. జెత్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవపూర్ నివాసి, 26 ఏళ్ల ఆటో డ్రైవర్ సతీష్ గౌతమ్ తన వాహనంలో 15 మంది ప్రయాణికులను మోహన్‌గంజ్‌కు తీసుకువెళుతున్నాడు. లీలాపూర్ ప్రాంతంలోని విక్రమ్‌పూర్ మలుపు దగ్గర కు ఆటో వారణాసి-లక్నవూ హైవేపై ఎదురుగా వస్తున్న ట్యాంకర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయింది.. దాంతో వేగంగా వచ్చి ఆటోను లారీ ఢీ కొట్టి బోల్తా పడింది..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో ఉన్న ప్రయాణికులను రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఆరుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. అంబులెన్స్ డ్రైవర్లు వారి మృతదేహాలతో ప్రతాప్‌గఢ్‌కు తిరిగి వచ్చారు.. మృతుల లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. స్థానికంగా మృతుల బంధువుల రోధనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. పోలీసులు కూడా అతి వేగం వద్దని ఎంతగా చెప్పినా కూడా వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి..
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!