ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను చంపేందుకు కుట్ర పన్ని ఈ రిక్షా డ్రైవర్ తో హత్య చేయించింది. మొదట్లో అందరూ ప్రమాదమని అనుకున్నారు. ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో నిజం బయటపడింది. దీంతో ఆటో డ్రైవర్, మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: 3Years Boy: థర్డ్ ఫ్లోర్ నుంచి గాలి పటం అందుకోబోతూ..
పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం, హనుమంత్‌లాల్ తన భార్య పూజ పిల్లలతో కలిసి దేవా జాతరకు వెళ్లారు. అయితే జాతర నుండి తిరిగి వస్తుండగా, మృతుడు హనుమంత్‌లాల్ మోటార్ సైకిల్ పై ఉన్నాడు. ఆటో డ్రైవర్ అతన్ని రోడ్డుపై ఆపి ఇనుప రాడ్ తో కొట్టి చంపారు. ఆ తర్వాత వారు ఈ సంఘటనను ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఈ-రిక్షా డ్రైవర్ తో కలిసి లక్నోకు తిరిగి వచ్చింది. తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని భార్య పోలీసులకు చెప్పింది.
Read Also:Guntur Rape Case: రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం కేసు.. కామాంధుడి అరెస్ట్…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన బారాబంకిలోని ఘుంఘేటర్ ప్రాంతంలో జరిగింది. పూజా గౌతమ్ అనే ఆ మహిళ మొదట్లో తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పింది. ఆమె పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులు ఆమెను అనుమానించారు. కఠినంగా ఆమెను విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విచారణలో పూజకు తన మేనల్లుడితో అక్రమ సంబంధం ఉందని తేలింది. ఇంట్లో వివాదాలు పెరగడంతో, ఆమె తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె లక్నోకు చెందిన ఈ-రిక్షా డ్రైవర్ కమలేష్‌ను కలిసింది. తన భర్తను చంపడానికి అతనికి లక్ష రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది.
Read Also:13 Years Boy: గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడిన బాలుడు.. చివరికి ఏమైందంటే?
మృతుడి బిడ్డ నిజాయితీ, పోలీసు బృందం సున్నితత్వం కారణంగా హత్య ఛేదించబడిందని ASP వికాస్ చంద్ర త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం, పూజ, కమలేష్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, మొబైల్ ఫోన్, ఈ-రిక్షా వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ-రిక్షా డ్రైవర్ కమలేష్ కు భార్య లక్ష రూపాయలు లంచం ఇచ్చిందని ఏఎస్పీ తెలిపారు.