UP Crime: అక్రమ సంబంధానికి ఒప్పుకోకపోవడంతో.. కొత్తగా పెళ్లయిన మహిళపై అత్యాచారం..
- కొత్తగా పెళ్లయిన మహిళపై అత్యాచారం..
- భర్త బయటకు వెళ్లిన తర్వాత నిందితుడి అఘాయిత్యం..
- అక్రమ సంబంధానికి ఒప్పుకోకపోవడంతో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కఠినమైన అత్యాచార చట్టాలు, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల్లో భయం కలగడం లేదు. ఇటీవల కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. నిందితుడిని వెంటనే శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేశారు. మహిళల రక్షణకు మరింత కఠినమైన చట్టాలు రావాలని కోరారు.
Read Also: Vijayawada: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లయిన మహిళపై ఇంట్లోనే అత్యాచారం జరిగింది. భాదోహిలో 20 ఏళ్ల మహిళపై రాహుల్(28)అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం మహిళ భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్ ముందుగా సదరు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడని, ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో డబ్బులు కూడా ఎరగా చూపాడని, ఆమె ప్రతిఘటించడంతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఇన్‌స్పెక్టర్ సచ్చిదానంద్ పాండే తెలిపారు.
భర్త తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని అతడికి వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64[1] (రేప్), 351[2] (నేరపూరిత బెదిరింపు) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!