Site icon NTV Telugu

UP: ఇద్దరు పురుషులతో హోటల్ బాత్రూంలో పట్టుబడ్డ డాక్టర్ భార్య.. వీడియో వైరల్..

Up Incident

Up Incident

UP: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్ బాత్రూంలో ఓ డాక్టర్ భార్య, ఇద్దరు పురుషులతో అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. సదరు మహిళ ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తోంది. ఇలా రాజీపడిన స్థితిలో మహిళ పట్టుబడటంతో ఆమె భర్త, భర్త తరుపు బంధువులు తీవ్రంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రామ మందిరాన్ని’’ శుద్ధి చేస్తాం..

వివాదాల కారణంగా భార్య గత ఏడాది భర్త నుంచి విడిగా జీవిస్తోంది. విడిపోయిన భార్య గురించి విషయం తెలిసి, ఆమె హోటల్ గదిలో ఉన్న సమాచారంతో అక్కడి వెళ్లడంతో ఈ అనూహ్యమైన ఘటన చూడాల్సి వచ్చింది. హోటల్ గదిలో ప్రవేశించిన తర్వాత సదరు భర్త, తన భార్య మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. ఇద్దరు పురుషుల్లో ఒకరు బులంద్ షహర్‌కి చెందిన వాడు కాగా, మరొకరు ఘజియాబాద్‌కి చెందిన వాడు. ముగ్గురూ కూడా హోటల్ గదిలోని టాయిలెట్‌లో కనిపించారు.

వీరిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భర్తతో పాటు ఆయన ఇద్దరు బంధువులు, నిందితులైన భార్య ప్రేమికులు ఇద్దరు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న మహిళను అరెస్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Exit mobile version