Gaming addict: ఆన్లైన్ గేమింగ్‌కి బానిస.. అప్పు తీర్చేందుకు కన్నతల్లినే కడతేర్చిన కసాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaming addict: ఆన్‌లైన్ గేమింగ్స్‌కి యువత బానిసగా మారుతోంది. ఈ వ్యసనం కారణంగా అప్పుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సొంత తల్లినే కడతేర్చాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం.. తల్లిదండ్రుల పేరిటి ఇన్సూరెన్స్ చేయించి, వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిని హిమాన్షుగా గుర్తించారు. గేమింగ్‌లో నష్టాల కారణంగా అప్పులపాలు కావడంతో, వీటిని తీర్చేందుకు తన అత్త ఇంటి నుంచి నగలు దొంగిలించి, వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో తల్లిదండ్రుల పేరుతో రూ.50 లక్షలకు జీవిత బీమా చేయించాడు. ఈ డబ్బులను క్లెయిమ్ చేసేందుకు తల్లి ప్రభను చంపేశాడు. హిమాన్షు జూపీ అనే యాప్‌లో ఆన్లైన్ గేమింగ్‌కి బానిస అయినట్లు తేలింది. దీంతో రూ. 4 లక్షల వరకు అప్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పులు తీర్చాలని స్నేహితుల నుంచి ఒత్తిడి రావడంతో తల్లిని చంపాడు.
Also Read
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Read Also: Ajit Pawar: 65 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు మళ్లీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు..
పోలీసులు కథనం ప్రకారం.. తండ్రి రోషన్ సింగ్ చిత్రకూట్ ఆలయాన్ని సందర్శించేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో, హిమాన్షు తన తల్లి ప్రభ గొంతు కోసి చంపాడు. మృతదేహాన్ని జూట్ సంచిలో పెట్టుకుని, ట్రాక్టర్‌పై తీసుకెళ్లి యుమునా నది ఒడ్డున పారేశాడు. తండ్రి ఇంటికి వచ్చే సరికి భార్య, కొడుకు హిమాన్షు కనిపించలేదు. అయితే, నదికి సమీపంలో ట్రాక్టర్‌పై హిమాన్షను చూసినట్లు ఇరుగుపొరుగు వారు చెప్పడంతో, ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి 21న ప్రభ మృతదేహాన్ని వెలికితీసి, హిమాన్షును అరెస్టు చేశారు. అప్పులు తేర్చడానికి అతను వేసుకున్న ప్లాన్ గురించి పోలీసులకు వెల్లడించారు. తల్లిని అరెస్ట్ చేసిన తర్వాత పరారీలో ఉన్న హిమాన్షను పోలీసులు పట్టుకున్నారు. తన బంధువుల నగలు దొంగిలించిన విషయం తెలియడంతో తల్లి తిట్టాడని, అతడిని నగలు వెనక్కి ఇవ్వాలని చెప్పులతో కొట్టినట్లు, అందుకే తల్లిని హత్య చేసి అప్పులు తీర్చాయాలని అనుకున్నట్లు హిమాన్షు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
-
Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!