Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి గుజరాత్లో వెలుగుచూసిన ఒక దారుణ ఘటనే నిదర్శనం. కేవలం ఇంటి అద్దె బకాయిలను చెల్లించలేక, ఒక కన్నతండ్రే తన భార్య, మైనర్ కూతురిని ఇంటి యజమాని లైంగిక వేధింపులకు గురిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. నమ్మకానికి, రక్షణకు మారుపేరుగా నిలవాల్సిన భర్త, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన ఈ హేయమైన చర్య దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం సుమారు ఆరు నెలల క్రితం ఉపాధి వెతుక్కుంటూ మోర్బి నగరానికి వలస వచ్చింది. అక్కడ వారు నెలకు రూ. 2,000 అద్దెతో ఒక ఇంట్లో నివాసం ఉండటం ప్రారంభించారు. అయితే, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం గత నాలుగు నెలలుగా ఇంటి అద్దెను చెల్లించలేకపోయింది. దీంతో అద్దె బకాయిలు పేరుకుపోయాయి.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
అద్దె డబ్బులు ఎలా కట్టాలో తెలియని తరుణంలో.. ఆ వ్యక్తి మానవత్వాన్ని మరిచి ఒక వికృతమైన ఆలోచన చేశాడు. పేరుకుపోయిన అద్దె బకాయిలకు బదులుగా, తన భార్య మరియు మైనర్ కుమార్తెపై లైంగిక దాడి చేయడానికి ఇంటి యజమానికి అనుమతిస్తూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఇంటి యజమాని వారిద్దరిపై పలుమార్లు లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కేసు నమోదు..
బాధిత మహిళ ఈ విషయాన్ని తన తల్లికి వివరించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న మహిళ తల్లి వెంటనే మోర్బి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తీవ్రతను గమనించిన పోలీసులు నిందితులపై కఠిన చట్టాలతో పాటు, మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు గానూ ‘పోక్సో’ (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బాలిక తండ్రితో పాటు, ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోర్బి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె.ఎమ్. లాల్ మాట్లాడుతూ.. తండ్రి, యజమాని కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిర్ధారించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?