School Assault: తిరుపతి జిల్లాలోని పుత్తూరు పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మణీ దీపికపై సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలు విచక్షణ రహితంగా దాడి చేసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే కారణంతో సోషల్ టీచర్ రాజేశ్వరి కొట్టింది. గొంతు పట్టుకోవడంతో విద్యార్థిని స్పృహ తప్పి కింద పడిపోయిన విద్యార్థి, మరో స్టూడెంట్ అనుశ్రీ అడ్డుకోవడంతో ఆమెపై కూడా దాడి చేసింది ఉపాధ్యాయురాలు.
Read Also: Sri Vishnu : చురకత్తిలా దూసుకెళ్తున్న శ్రీవిష్ణు
ఇక, స్పృహ తప్పిన మణీ దీపికను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పాఠశాలలోని ఇతర సిబ్బంది. ఆసుపత్రికి కూడా రాకుండా తన రూంలోకి వెళ్లి సోషల్ టీచర్ రాజేశ్వరి కూర్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు తల్లి భవానీ ఫిర్యాదు చేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని ఆవేదన వ్యక్తం చేసింది.