మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో అక్టోబర్ 21న ఇర్ఫాన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇర్ఫాన్ తండ్రి హసన్ ఖాన్ కాంట్రాక్ట్ ఇచ్చి తన కొడుకును చంపేశాడని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్, జూదానికి ఇర్ఫాన్ అలవాటు పడటంతో తండ్రి ఇబ్బంది పడి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే.. గ్వాలియర్ జిల్లాలోని పాత కంటోన్మెంట్ నివాసి ఇర్ఫాన్ ఖాన్ అక్టోబర్ 21 న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అనుమానితులను పోలీసులు విచారించారు. అందులో భాగంగా ఇర్ఫాన్ తండ్రి హసన్ ను కూడా విచారించడంతో పోలీసులకు క్లూ లభించింది. హసన్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
READ MORE: Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..
కుమారుడి చేష్టలకు తండ్రి మనస్తాపం..
హసన్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్ఫాన్ కి నేర చరిత్ర ఉంది. అతను జూదం, గంజాయికి కూడా బానిస. అతని విధ్వంసక అలవాట్ల కారణంగా కుటుంబంతో సంబంధాలు సరిగ్గాలేవు. దీంతో తరచూ గొడవలు జరిగేవి. కొడుకు వ్యసనం, అతని జీవితంపై చూపుతున్న ప్రతికూల ప్రభావంతో విసుగు చెందిన హసన్ ఖాన్ ఇర్ఫాన్‌ను చంపాలని ప్లాన్ చేశాడు. రూ. 50,000 కాంట్రాక్ట్ పిక్స్ చేసుకున్నాడు. అర్జున్ అలియాస్ షరాఫత్ ఖాన్, భీమ్ సింగ్ పరిహార్ అనే ఇద్దరు కిరాయి హంతకులను హసన్ నియమించుకున్నాడు. అక్టోబర్ 21న, హసన్ ఇర్ఫాన్‌ను మభ్యపెట్టి, బదన్‌పురా-అక్బర్‌పూర్ కొండ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కాంట్రాక్ట్ కిల్లర్లు అతనిపై మెరుపుదాడి చేసి తల, ఛాతీపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
READ MORE:AP Govt: ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
హత్య తర్వాత, గ్వాలియర్ పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. పలువురు అనుమానితులను విచారించి, సాక్ష్యాలను సేకరించారు. తర్వాత, వారు హసన్ ఖాన్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అతని ప్రవర్తన, అస్థిరమైన వాదనల కారణంగా పోలీసుల అనుమానం బలపడింది. తదుపరి విచారణలో.. హసన్ నేరంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. కాంట్రాక్ట్ కిల్లర్‌ని నియమించుకుని ఆకతాయిలు ఏర్పాటు చేసినట్లు అంగీకరించాడు. పరారీలో ఉన్నట్లు భావిస్తున్న అర్జున్ అలియాస్ షరాఫత్ ఖాన్, భీమ్ సింగ్ పరిహార్ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.