Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eagle Force: తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల ముఠాలపై తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ నిఘా పెంచింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU), నల్సార్ (NALSAR), గీతం (GITAM) వర్సిటీలలో గంజాయి సరఫరా, వినియోగానికి సంబంధించి దాడులు నిర్వహించి కీలక నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈగిల్ ఫోర్స్ టోల్-ఫ్రీ నంబర్ (1185) ద్వారా అందిన సమాచారంతో అక్టోబర్ 29న హెచ్‌సీయూ విద్యార్థులు భరద్వాజ్ (27), ఆనంద్ (26)లను అదుపులోకి తీసుకుని పరీక్షించగా వారికి గంజాయి వాడినట్లు (THC పాజిటివ్) తేలింది. వీరిచ్చిన వివరాలతో గౌలిదొడ్డిలో నివాసముంటున్న నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు బికాష్ సింగ్ అలియాస్ జంగ్ (30)ను అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి (24 ప్యాకెట్లు), మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ‘రైజ్’ నుంచి సరుకు తెచ్చి, వర్సిటీ సౌత్ గేట్ సమీపంలో ఒక్కో ప్యాకెట్‌ను ₹500 నుంచి ₹1,000 వరకు విక్రయిస్తున్నట్లు జంగ్ అంగీకరించాడు.
ఈ కేసులో గచ్చిబౌలి పీఎస్‌లో గత ఆగస్టులో నంబర్ 1030 ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో సందేష్ (24) అనే విద్యార్థితో పాటు, అతనికి గంజాయి విక్రయిస్తున్న మాజీ విద్యార్థి బిశ్వజిత్ కలితా (28)ను అరెస్ట్ చేసి 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 24 మంది హెచ్‌సీయూ విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నట్లు తేలింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని, అవసరమైతే డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపాలని వర్సిటీ వీసీకి ఈగిల్ ఫోర్స్ లేఖ రాయనుంది. నల్సార్ వర్సిటీ హాస్టళ్లలో గంజాయి సరఫరాపై అందిన సమాచారం ఆధారంగా 17 మంది విద్యార్థుల పాత్రపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, వర్సిటీ సమీపంలోని నైట్ టీ స్టాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మరణించగా, అతని వద్ద గంజాయి ప్యాకెట్ లభించింది. ప్రమాద సమయంలో బైక్‌పై ఉన్న మరో విద్యార్థికి గంజాయి పాజిటివ్ వచ్చింది.
Also Read
- Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
- Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
- చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
- Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
గీతం వర్సిటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి నానక్‌రామ్‌గూడ పరిసరాల్లో గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడగా, పటాన్చెరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. వర్సిటీ క్యాంపస్‌లో అధికారులు తనిఖీలు చేపట్టి, మరో విద్యార్థికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రగ్స్ బారిన పడిన యువతను కాపాడేందుకు సమాజం, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కలిసి రావాలని ఈగిల్ ఫోర్స్ పిలుపునిచ్చింది. సమాచారం అందించేందుకు టోల్-ఫ్రీ 1908 లేదా వాట్సాప్ 87126 71111 నంబర్లలో సంప్రదించాలని, సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!