JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Chakravarthy: టాలీవుడ్‌లో తన నటన, దర్శకత్వంతో ఒక విలక్షణమైన ముద్ర వేసిన హీరో జేడీ చక్రవర్తి. సుమారు 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన NTV పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో జేడీ చక్రవర్తి తన 36 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంపై స్పందించారు. తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని, తన దైనందిన జీవనశైలిని వివరించారు.
రామ్ గోపాల్ వర్మతో విడదీయలేని బంధం..
తన కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. “ఆర్జీవీ ఒక ‘యాక్టర్స్ డైరెక్టర్’. ఆయనతో పని చేయడం అంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే కాదు, ఒక బలమైన స్నేహం” అని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ చిత్రం ఎప్పటికీ తన కెరీర్‌లో నెంబర్ వన్ అని, ఆ తర్వాత ‘మనీ’, ‘సత్య’ వంటి చిత్రాలు తనను నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లాయని తెలిపారు. సినిమా విజయంలో కంటెంట్ పాత్ర గురించి మాట్లాడుతూ.. “కంటెంట్ అనేది రాణి అయితే, దాన్ని తెరకెక్కించే దర్శకుడు రాజు. సినిమా రిజల్ట్ గురించి నేను ఎప్పుడూ అతిగా ఆలోచించను. హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆ నిర్ణయం నాదే కాబట్టి బాధ్యత కూడా నాదే” అని స్పష్టం చేశారు. తాను సినిమాల్లోకి హీరో అవుదామని వచ్చానని, శివ సినిమా తర్వాత దాదాపు 30 నుంచి 40 సినిమాల వరకు రిజెక్ట్ చేశానని చెప్పారు. వైఫల్యాల నుంచి కూడా తాను ఎంతో నేర్చుకున్నానని, తన జీవితంలో ప్రతి నిర్ణయం తనదేనని స్పష్టం చేశారు.
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
తాజావార్తలు
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!