Tattoo artist: శవమై కనిపించిన మహిళా టాటూయిస్ట్. పరారీలో ప్రియుడు..
- శవమై కనిపించిన మహిళా టాటూ ఆర్టిస్ట్..
- బాయ్‌ఫ్రెండ్ చంపినట్లు అనుమానం..
- పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tattoo artist: మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ముర్తిజాపూర్ పట్టణంలో అస్సాంకు చెందిన 26 ఏళ్ల మహిళా టాటూయిస్ట్ తలకు గాయాలై మృతి చెందింది. ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన లవర్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమచారం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
బాధిత మహిళను శాంతిక్రియా కశ్యప్ అలియస్ కోయెల్‌గా గుర్తించారు. జూలై 24న ముర్తిజాపూర్‌లోని ప్రతీక్ నగర్ ప్రాంతంలో ఆమె తన ఇంట్లో శవమై కనిపించింది. ఈ ఇంట్లోనే ప్రియుడు కునాల్ సన్నీ శృంగారే(30) కూడా నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శృంగారే అని, అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అస్సాంకు చెందిన కశ్యప్ గత ఆరేళ్లుగా తన తల్లితో కలిసి ఢిల్లీలో ఉంటూ టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె ముంబైలో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
Read Also: Atal Setu Bridge: ఏమైందో పాపం.. అటల్ సేతుపై నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య.. వీడియో వైరల్..
ప్రాథమిక విచారణ ప్రకారం.. కశ్యప్, శృంగారే సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. ఇటీవల కశ్యప్‌ని శృంగారే ముర్తిజాపూర్ కి పిలిచాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టాడు. దీని ప్రకారం ఆమె జూలై 21న అక్కడికి వెళ్లింది. స్థానికంగా ఉండే ఓ బార్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న శృంగారే, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని బార్‌కి తీసుకెళ్లాడు. నిందితుడికి మద్యం సేవించే అలవాటు ఉందని, జూలై 23 రాత్రి అతనికి, కశ్యప్ మధ్య వాగ్వాదం జ రిగి, ఆవేశంతో ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం, ఇరుగుపొరుగు వారు పోలీసులకు కాల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హత్యానంతరం శృంగారే పరారీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!