Student Sui*cide: ఓవైపు పేరెంట్స్.. మరోవైపు ప్రేమ.. ఎటు తేల్చుకోలేక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Sui*cide: విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య కలకలం రేపింది. కని పెంచిన తల్లిదండ్రులు ఎక్కువా? ప్రేమించిన వాడు ఎక్కువా? ఎవరు కావాలో తేల్చుకోలేక సతమతమై ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది విద్యార్ధిని. స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.
Fake Tea Powder: మనం తాగేది చాయ్ కాదు.. భాగ్యనగరంలో కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు!
అమ్మానాన్న… నేను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నాను. అలాగే మిమ్మల్ని మోసం చేయడం కూడా కరెక్టు కాదనిపిస్తోంది. ఆ అబ్బాయిని వదిలేశాక నాకు ఏదోలా ఉంది. బతకడం ఇష్టంలేక ఈపని చేస్తున్నా.. నేను తప్పు చేశా. లవ్ చేశా. నేను మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఆ అబ్బాయిని వదిలేశా. కానీ.. అతనితోనే నాకు ఉండాలని ఉంది. కానీ నాకు వద్దు. ఎందుకంటే మీరే ఇంపార్టెంట్ నాకు. నేను మీ కోసం ఏమీ చేయలేకపోయా. కానీ తప్పు అయితే చేయాలని అనుకోవట్లేదు. నేనే లేకపోతే తప్పు అవ్వదు కదా. అందుకే బై. చెల్లి, తమ్ముడు జాగ్రత్త అంటూ ఫిజియోథెరపీ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి సత్యం కుటుంబం విశాఖ వుడా కాలనీలోని వినాయకనగర్‌లో నివసిస్తోంది. హెచ్‌సీఎల్‌లో సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పైడి రజిని మధురవాడలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫిబ్రవరి 23 నుంచి ఎగ్జామ్స్ ఉండడంతో ప్రిపరేషన్ హాలీడేస్ ఇచ్చారు. దీంతో రజిని ఇంటి వద్దనే ఉంటోంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా.. రజిని ఇంట్లోనే ఒంటరిగా ఉంది. తండ్రి బయటి నుంచి కుమార్తెకు ఫోన్ చేయటానికి ప్రయత్నించగా స్పందించలేదు. ఎదురింటి వ్యక్తికి చెప్పగా.. వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంది.
ZIM vs IND: టీమిండియా నయా రికార్డ్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి షాక్‌కు గురయ్యారు. బెడ్ రూంలోని బెడ్ మీద ఓ పేపర్ పై సూసైడ్ నోట్ రాసి ఉంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు ప్రేమికుడిని మరిచిపోలేక, అటు తల్లిదండ్రులను ఒప్పించలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్ కు తరలించారు.
తాజావార్తలు
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!