Crime news: రోజు రోజుకి మానవ సంబంధాలు మాయావుతున్నాయి. మమతానురాగాలు కరువవుతున్నాయి. లోకంలో మానవత్వం మచ్చుకైనా లేదు అనిపించేలా రక్తసంబంధీకులే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిన వాళ్లే అనే విషయాన్నీ మర్చిపోయి విచక్షణారహితంగా కుటుంబసభ్యులే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా లోని బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఖాసీంపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి గ్రామంలో పలువురి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు.
Read also:Telangana: BRS నాయకులకు మావోయిస్టుల హెచ్చరిక..
ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు కోసం వెంకటేష్ తల్లిని నిలదీశారు. దీనితో ఆమె తన కొడుకు వచ్చి డబ్బులు ఇస్తాడని చెప్పింది. కాగా పండుగకు వెంకటేష్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన సదరు వ్యక్తులు వెంకటేష్ ని డబ్బులు ఇవ్వాలని నిలదీశారు. దీనితో తాను ఇంటికి వచ్చినట్టు తన తల్లి అప్పులవాళ్ళకి చెప్పిందనే అనుమానంతో తల్లి పైన కక్ష పెంచుకున్నాడు. కాగా సమయం కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ తన తల్లి అంజమ్మ నిద్రపోతుండగా గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి చెరువులో పడేసాడు. కాగా తల్లి కనిపించకపోవడంతో అంజమ్మ మరో కొడుకు పోలీసులకు పిర్యాదు చేసాడు. దీనితో ఈ వార్త వెలుగు చూసింది. కాగా అంజమ్మ మృత దేహం ఇంకా చెరువులోనే ఉంది.