NTV Telugu Site icon

AP Crime: ఈఎంఐ చెల్లించలేదని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి న్యూడ్‌ ఫొటోలు..! ట్విస్ట్‌ ఏంటంటే..?

Loan App

Loan App

AP Crime: లోన్‌ యాప్‌ల వేధింపులు అంతా ఇంతా కాకుండా పోతున్నాయి.. లోన్‌ తీసుకోవాలంటూ వేధింపులు ఓవైపు.. మరోసారి లోన్‌ తీసుకున్న తర్వాత కట్టడం లేదంటూ మరో రకమైన టార్చర్‌.. ఆ లోన్‌ యాప్‌ల వేధింపులతో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు విడిచారు.. మరెంతో మంది వేధింపులతో తీవ్రమైన మానసికక్షోభ అనుభవిస్తున్నారు.. అయితే, ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్‌ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు..

Read Also: Manmohan Singh: 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నా, అందుకే ఏ రాజాని మంత్రిగా కొనసాగించా..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ ఆరు నెలల కిందట ఫినబుల్‌ యాప్‌లో లోన్‌ తీసుకుంది. ఈ క్రమంలో సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్‌ చేసి వేధించారు. లోన్ తాలూకూ డబ్బులు చెల్లించడం లేదంటూ దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి మార్ఫింగ్ చేసిన కొన్ని న్యూడ్‌ ఫొటోలు కూడా పంపించడంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎంత వారించినా ఏజెంట్లు వినకపోవడం, బెదిరింపులు పెరుగుతుండడంతో ఏజెంట్ల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో సకాలంలో స్పందించిన పోలీసులు.. ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సుబ్బారాయుడు ఈ సందర్భంగా సూచించారు. ప్రజలు సైబర్ నేరాలు.. లోన్ ​యాప్ బెదిరింపులపై అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.. ఇక, యువతిని వేధించిన ఫినబుల్ లోన్ యాప్‌పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని తెలిపారు ఎస్పీ సుబ్బారాయుడు..

Show comments