SI Pandyarajan Arrested For Harassing Girl Physically From 7 Years: రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే భక్షకుడయ్యాడు. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతగాడు, కూతురిపై కూడా కన్నేశాడు. ఏడేళ్లుగా ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. చివరికి అతని బండారం బయటపడటంతో, కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాండ్యరాజన్ (50) అనే వ్యక్తి చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతడు గత పదేళ్లుగా ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే.. అతనికి ఆమె కూతురిపై కూడా కన్ను పడింది. ప్రియురాలి ఇంటికి వెళ్లినప్పుడల్లా.. ఆమె కూతురిపై లైంగిక వేధింపులు పాల్పడేవాడు. ఈ విషయం ప్రియురాలికి తెలిసినా, ఏమనలేక చూస్తుండిపోయింది. పోలీస్ అధికారి కదా.. అందుకే, అతని ఆగడాలకు అడ్డు చెప్పలేకపోయింది.
అలా ఏడేళ్లుగా ఆ అమ్మాయిని వేధిస్తున్న ఆ ఎస్సై.. ఆమెకు పెళ్లయిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. అత్తారింటి నుంచి తల్లి వద్దకు వచ్చిన ప్రతీసారి.. తమ కోరిక తీర్చాల్సిందిగా అతడు బలవంతం చేశాడు. అతని వేధింపులు సహించలేకపోయిన ఆ అమ్మాయి, తల్లి వద్ద మొరపెట్టుకుంది. దీంతో చలించిపోయిన ఆ మహిళ, ఇక అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ, కూతురిని వెంట వేసుకొని మహిళ పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. ఆ ఎస్సై మీద తల్లికూతుళ్లు కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో భాగంగా ఆ అమ్మాయికి 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించినట్టు వెల్లడైంది. ప్రస్తుతం ఆమెకు మరొకరితో వివాహం అయినప్పటికీ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తేలడంతో, ఆ ఎస్సై మీద ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.