Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Secunderabad Btech Student Akhil Murdered Over Love Affair Chilkalguda

HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!

Published Date :May 10, 2026 , 8:18 am
By RAMAKRISHNA KENCHE
HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

HYD LOVE MURDER: సికింద్రాబాద్ చిలకలగూడలో ఓ యువకుడి ప్రేమ.. అతని ప్రాణాలు తీసింది. యువతి సోదరులు, బంధువులు కక్షకట్టి దాడి చేయడంతో బీటెక్ చదువుతున్న యువకుడు ప్రాణాలు వదిలాడు. రాత్రిపూట జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సిటీని ఉలిక్కపడేలా చేసింది. పైన ఫోటోలో ఉన్న యువకుడి పేరు యువన్ అలియాస్ అఖిల్. ప్రస్తుతం అల్వాల్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సీతాఫల్‌మండీలో ఉన్న యువన్.. ఆ సమయంలో అక్కడి యువతిని ప్రేమించాడు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులు.. అల్వాల్‌కు మకాం మార్చడంతో అక్కడికి వెళ్లిపోయాడు. కానీ అప్పుడప్పుడు వచ్చి యువతితో మాట్లాడుతున్నాడు.

మరోవైపు అమ్మాయి కుటుంబ సభ్యులు కులం కారణంగా ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అబ్బాయిని మరోసారి కలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అతడిని చంపేస్తామని బెదిరించినట్టు సమాచారం. ఈ విషయాలన్నీ యువతి తన ప్రియుడికి చెప్పినప్పటికీ, ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో యువన్ వెనక్కి తగ్గలేదు. ఘటన జరిగిన రోజు రాత్రి యువన్ తన స్నేహితులతో కలిసి సెల్‌ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన సుమారు 8 మంది యువకులు అతడితో వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తులతో దాడి చేసి తల, మెడ, ఛాతి భాగాల్లో సుమారు 15 కత్తిపోట్లు పొడిచి అక్కడికక్కడే హత్య చేశారు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

Also Read

  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
  • Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
  • Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
Add as a preferred
source on google

యువన్ హత్య వార్త తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు యువతి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. హత్య వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం అఖిల్‌, యువతి మధ్య ఫోన్‌ కాల్‌లో జరిగిన సంభాషణల ఆడియో రికార్డు వెలుగులోకి వచ్చింది. చెప్పిన మాట వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని, నీపై తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆ యువతి అఖిల్‌తో చెబుతున్నట్టుగా రికార్డయ్యింది. కేసు పెట్టకపోతే ఇద్దరినీ బతుకనివ్వబోమని బెదిరస్తున్నారని చెప్పింది. ఇందుకు అఖిల్‌ స్పందిస్తూ మొన్ననే కాంప్రమైజ్‌ అయ్యాము కదా.. మళ్లి పోలీస్‌ కేసేమిటి? నాతో మాట్లాడొచ్చుకదా? అని జవాబిచ్చినట్టు ఆడియోలో వినిపిస్తోంది. దీంతో పథకం ప్రకారమే అఖిల్‌ను హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhil murder
  • BTech student killed
  • Chilkalguda crime
  • Gandhi Hospital
  • hyderabad crime news

తాజావార్తలు

  • Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్‌రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!

  • Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర

  • Shubman Gill: ఏబీ డి విలియర్స్‌ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్

  • Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!

  • Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions