Bank Fraud: SBI బ్యాంక్‌లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్‌తో పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్‌బీఐ (SBI) బ్యాంకులో పనిచేసే ఒక మేనేజర్ , మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఖాతాదారుల సొమ్మును కాజేసిన వైనం నల్గొండ జిల్లాలో బయటపడింది. సుమారు 2.65 కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎవరు ఈ నిందితులు..?
ఈ దోపిడీలో నలుగురు ప్రధాన నిందితులు ఉన్నారు. వారిలో ఎస్‌బీఐ సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ పి. వెంకట రమంజనేయులు, దేవరకొండ బ్యాంకులో హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా పనిచేసే చక్రపాణి, రికవరీ ఏజెంట్ రామ్‌లాల్, ఫోటోగ్రాఫర్ శివ ఉన్నారు.
Also Read
- Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్‌లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
దోపిడీ ఎలా జరిగింది?
చాలా కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగకుండా ఉన్న బ్యాంకు ఖాతాలను వీరు టార్గెట్ చేశారు. బ్యాంకు మేనేజర్ తనకున్న అధికారంతో బ్యాంకు సిస్టమ్ ద్వారా ఎక్కువ డబ్బు ఉన్న 10 ఖాతాల వివరాలను సేకరించాడు. ఆ తర్వాత ఆ ఖాతాదారుల పేర్లతో నకిలీ ఆధార్ కార్డ్‌లు , పాన్ కార్డ్‌లను సృష్టించారు.
ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి, బ్యాంకు రికార్డుల్లో ఖాతాదారుల ఫోన్ నంబర్లను మార్చేశారు. కొత్త నంబర్లతో కేవైసీ (KYC) అప్డేట్ చేసి, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్ ద్వారా కొత్త యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను పొందారు. ఆపై ఖాతాల్లో ఉన్న డబ్బును తమకు తెలిసిన వారి అకౌంట్లలోకి మళ్లించారు.
మోసం బయటపడింది ఇలా..
హైదరాబాద్‌కు చెందిన పి. నరేంద్ర అనే వ్యక్తి ఖాతాలో వీరు అనధికారికంగా కేవైసీ మార్పులు చేసినప్పుడు, అతనికి ఒక అలర్ట్ ఈమెయిల్ వచ్చింది. దీనిపై అనుమానం వచ్చిన నరేంద్ర వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అంతర్గత విచారణ జరిపి మోసం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 2.42 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి దగ్గర ఉన్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. కాజేసిన సొమ్ములో మేనేజర్ , చక్రపాణికి చెరో 40 శాతం, మిగిలిన ఇద్దరికీ 10 శాతం చొప్పున వాటాలు పంచుకున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Ashirvad Sooryavanshi: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆశీర్వాద్ సూర్యవంశీ వీర విహారం.. మురిసిపోయిన వైభవ్..
-
ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
-
Ginger Chutney: కొలతలతో నిల్వ ఉండే టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!