Samantha: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొద్దిరోజులుగా సమంత ప్రెగ్నెన్సీ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఆమె టీ షర్ట్, జీన్స్‌లో కనిపించింది. ఈ క్రమంలోనే బేబీ బంప్ కనిపించిందని మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిసిన క్రమంలో, మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్న సమంత దంపతులకు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆయన మరింత లీక్ చేసినట్లయింది.
ఇప్పుడు తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని సమంత కన్ఫర్మ్ చేసింది. “ఎవరికైనా ఇంత మంచి సక్సెస్ వచ్చాక గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేయాలనుకుంటారు, మీరేమనుకుంటున్నారు?” అని ఒక విలేకరి ప్రశ్నించగా.. “సారీ అండి, మరోసారి గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి” అని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు సమంత ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలన్నింటికీ ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. ఈ క్రమంలో సమంత త్వరలో తల్లి కాబోతోందనే వార్త ఆమె నోటి ద్వారానే వినడంతో అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
-
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!