Murder : మామ ఆస్తి కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూపు.. చివరికి
- దొంగ తెలివి తేటలు శ్రుతి మించుతున్నాయి
- మామ అయ్యే కట్రోత్ శివయ్య ఆస్తిపై కన్నేశారు
- మామ ఆస్తి కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూపు
- చంపేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. సైదాబాద్ విష్ణునగర్‌లో వృద్ధుడిని చంపేసిన కోడలు.. దోపిడీ దొంగల ప్రయత్నంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమె తెలివితేటలకు చెక్ పెట్టారు. ఆమెతోపాటు సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు నినవత్ మంగ. పక్కనే ఉన్నది ఆమె ప్రియుడు వెంకట్. ఈ ఇద్దరు కలిసి దారుణమైన స్కెచ్ వేశారు. నినవత్ మంగకు వరుసకు మామ అయ్యే వృద్దుడు కట్రోత్ శివయ్య ఆస్తిపై కన్నేశారు. ఆయన్ను చంపేస్తే ఆస్తి తమకే వస్తుందని.. మంగ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో అతన్ని చంపేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది..
సైదాబాద్.. విష్ణునగర్‌లో కట్రోత్ శివయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. సెప్టెంబర్ 14న రాత్రి సమయంలో.. శివయ్య ఉంటున్న ఇంటికి మంగ.. తన ప్రియుడు వెంకట్‌తోపాటు కొడుకు భరత్‌ను తీసుకుని వెళ్లింది. నిద్రపోతున్న శివయ్యను.. దిండుతో ఊపిరి ఆడకుండా చేశారు. తర్వాత గొంతు నులిమి చంపేశారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ఎత్తుకుని వెళ్లిపోయారు. అంతే కాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు శివయ్య గొంతు కోసి.. డెడ్ బాడీని ఇంటి ముందు పడేశారు..
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ఉదయం.. ఏమీ తెలియనట్లుగా వచ్చిన మంగ..కొత్త డ్రామా షురూ చేసింది. అర్ధరాత్రి దొంగలు పడి తన మామను చంపేశారని.. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారని నాటకం మొదలు పెట్టింది. ఈ మేరకు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు షురూ చేశారు. ఈ కేసులో సీసీ ఫుటేజీల పరిశీలనతోపాటు అన్ని కోణాల్లో విచారణ చేశారు. బంధువులను విచారించారు. ఐతే పోలీసులకు.. మంగ ఓవరాక్షన్ చూసి అనుమానం వచ్చింది. దీంతో ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఆస్తి కోసం తామే హత్య చేసినట్లు వెల్లడించింది. తనకు కొడుకు భరత్‌తోపాటు వెంకట్ అనే వ్యక్తి మరో నలుగురు సాయం చేశారని వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట్ అనే వ్యక్తి మంగ ప్రియుడిగా విచారణలో తేలింది..
ఐతే మంగ చాలా కాలం నుంచి వృద్ధుడు శివయ్యకు సంబంధిచిన ఇంటిపై కన్నేసింది. తన పేరిట రాసి ఇవ్వాలని కూడా అడిగింది. ఐతే శివయ్య అందుకు నిరాకరించాడు. తన ఇంటిని ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. నిన్న చంపి అయినా ఇల్లు, ఆస్తి తీసుకుంటానని మంగ.. మంగమ్మ శపథం చేసింది. చివరకు అన్నట్లుగా అతన్ని ఆస్తి కోసం చంపేసింది. ఆస్తి కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మంగను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!