Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Sabbavaram Mother Daughter Homicide Case

Crime : తల్లి హత్య..15 రోజుల మిస్టరీ ముగిసింది

Published Date :September 1, 2025 , 10:21 pm
By Gogikar Sai Krishna
  • బంకెల సంతుకు 37 ఏళ్లు
  • భర్తతో విభేదాలతో ఒంటరిగా జీవనం
  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలతో డబ్బు వృథా చేస్తున్న సంతు
  • తల్లితో కుమార్తెలు, మరిది మురళీధర్‌ గొడవ
Crime : తల్లి హత్య..15 రోజుల మిస్టరీ ముగిసింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

నవమాసాలు మోసి కనిపెంచిందన్న కనికరం లేదు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిందన్న విశ్వాసం లేదు. తల్లి ప్రవర్తనతో విసుగు చెంది బాబాయ్ సహాకారంతో కన్న తల్లినే అతి దారుణంగా అంతమొందించారు కన్న కూతుళ్లు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. అనకాపల్లి జిల్లాలో ఓ మహిళ మృత దేహం 15 రోజుల కిందట తీవ్ర కలకలం రేపింది. హైవేకు కూత వేటు దూరంలోనే పొదల్లో సగం కాలిన మృతదేహం అప్పట్లో సంచలనం కలిగించింది. చుట్టూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మిస్టరీగా మారింది. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు అనేది కొద్ది రోజుల పాటు మిస్టరీగా కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద 15 రోజుల క్రితం జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న తల్లి ప్రవర్తనతో విసుగుచెందిన కుమార్తెలు.. బాబాయ్‌తో కలిసి హత్యకు ప్లాన్ వేసి మర్టర్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది…

ఒడిశా రాష్ట్రానికి చెందిన బంకెల సంతుకు 37 ఏళ్లు.. భర్తతో కొంతకాలం క్రితం మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. సంతు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూర్మన్నపాలెంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నది. పెద్ద కుమార్తె అనూష పంజాబ్‌లోని యూనివర్సిటీలో చదువుతున్నది. 15 ఏళ్ల చిన్న కుమార్తె ఇంటర్‌ ఫస్ట్ సంవత్సరం చదువుతూ, హాస్టల్‌లో ఉంటున్నది. తల్లి సంతు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు లోనయి డబ్బులు వృథా చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కుమార్తెలతో పాటు సంతు మరిది మురళీధర్‌ ఇటీవల ఆమెతో గొడవపడ్డారు..

హాస్టల్‌లో ఉంటున్న చిన్న కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఫోన్‌లో అసభ్యకర దృశ్యాలతో పాటు బెట్టింగ్‌ యాప్‌లు ఉండడాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని అక్క అనూషకు చెప్పడంతో ఆమె పంజాబ్‌ నుంచి ఇక్కడకు వచ్చింది. ఇద్దరూ కలిసి తల్లిని నిలదీసి, ఆమెతో గొడవపడ్డారు. తల్లి ప్రవర్తనతో విసుగు చెందిన కుమార్తెలు… ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్‌నగర్‌లోనే నివాసం వుంటున్న బాబాయ్‌ మురళీధర్‌కు ఈ విషయం చెప్పి, ఆయన సాయం కోరారు. ముగ్గురూ కలిసి ప్రణాళికను రూపొందించుకుని ఆగస్ట్ 13న అర్ధరాత్రి దాటిన తరువాత గాఢ నిద్రలో వున్న ఉన్న సంతుని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురళీధర్‌ తన స్నేహితుడి కారులో సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్దకు తీసుకువచ్చి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు…

ఆగస్ట్ 14న ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు, సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సబ్బవరం పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. సంతుని ఆమె కుమార్తెలు, మరిది కలిసి హత్య చేసినట్టు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గుర్తించారు. మురళీధర్‌తోపాటు అనూషను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితురాలు మైనర్‌ కావడంతో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరుపరిచినట్టు ఎస్పీ తెలిపారు..

Uttar Pradesh: రెచ్చిపోయిన హిజ్రాలు.. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anakapalli
  • Family Crime
  • murder case
  • police investigation
  • Sabbavaram

తాజావార్తలు

  • Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చేస్తోంది.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, యాక్టివ్ మ్యాట్రిక్స్ ఫీచర్

  • CM Chandrababu: తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు.. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను!

  • Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు

  • Israel vs Muslim World: ఇజ్రాయెల్ వర్సెస్ ముస్లిం వరల్డ్.. వెస్ట్ బ్యాంక్ ఇష్యూలో ఏడు ముస్లిం దేశాల ఏకగ్రీవ హెచ్చరిక!

  • Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్

ట్రెండింగ్‌

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions