Naga Vamsi: లక్కీ భాస్కర్ కి అదే రిపీట్ చేస్తున్న నాగవంశీ
- లక్కీ భాస్కర్ కి అదే రిపీట్ చేస్తున్న నాగవంశీ
- గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి మీడియాకి రిలీజ్ రోజు షోస్ నిలిపివేత
- ఒకరోజు ముందుగానే లక్కీ భాస్కర్ ప్రీమియర్స్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని సినిమాలుగా ఫాలో అవుతూ వస్తున్న సెంటిమెంట్ ని నాగ వంశీ లక్కీ భాస్కర్ సినిమాకి కూడా ఫాలో అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి మీడియాకి రిలీజ్ రోజు షోస్ వేయడం ఆపేశారు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు. సినిమా కనుక శుక్రవారం రిలీజ్ అయితే శనివారం నాడు ఫ్యామిలీతో కలిసి సాయంత్రం సినిమాకి రండి అంటూ కొత్త ఒరవడికి తెర లేపారు. అయితే లక్కీ భాస్కర్ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ అవుతుంది. అంటే గురువారం నాడు రిలీజ్ అవుతుంది. కానీ ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు గురువారం నాడు అమావాస్య రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Amitabh Bachchan: కొడుకు విడాకుల వార్తలు.. 10 ఫ్లాట్లు కొన్న బచ్చన్!
Also Read
అయితే తన సెంటిమెంట్ ని ఫాలో అవుతూ బుధవారం నాడు మీడియా కి షో వేయడం లేదు నాగ వంశీ. రిలీజ్ రోజు ఉదయమే షో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. తెలుగులో పలు విభిన్నమైన చిత్రాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు ఫార్చునర్ 4 సినిమాస్ బ్యానర్ మీద నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ట్రైలర్ తో ఒక్కసారిగా ప్రేక్షకులందరికీ దృష్టిని ఆకర్షించిన ఈ లక్కీ భాస్కర్ సినిమాని తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
- Tags
- Lucky bhaskhar
- Naga Vamsi
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!