రంగారెడ్డి జిల్లాలో బాలికపై అత్యాచార యత్నం చేసిన రౌడీషీటర్ కి రిమాండ్ విధించింది కోర్టు. భార్య,చెల్లె పై అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ రౌడీ షీటర్ పై పోలీసులు కేసు నమోదుచేసి రిమాండకు తరలించారు. మంగళహాట్ చెందిన అబిద్ బిన్ ఖలీద్ అలియాస్ అబిద్ ( 34 ) వృత్తి రీత్యా మెకానిక్ . ఇతని పై రాజేంద్రనగర్,మంగ కోట్,షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే 26 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు పీడీ యాక్టు కూడా విధించారు. కర్మన్ ఘాట్ కు చెందిన ఒక మహిళను మూడు నెలల కిందట బలవంతంగా పెళ్లి చేసుకొని అక్కడే నివాసముంటున్నాడు.
ఆ మహిళ ఇద్దరు చెల్లెళ్లు,ఒక తమ్ముడుతో కలిసి ఉంటోంది. అతడు నెల కిందట ఆమె పెద్ద చెల్లె ( 16 ) తో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచార యత్నం చేశాడు. దీనిపై ఈనెల 25 న ఆమె భర్తను ప్రశ్నించింది. అతను బ్లేడ్ గాయం చేసుకుని మీ చెల్లెని కూడా చంపుతానంటూ ఆమె గొంతుపై కత్తి పెట్టాడు. బాధితుల ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మీర్ పేట్ లో అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పరారయ్యేందుకు ప్రయత్నించగా రెండు కిలోమీటర్లు వెంటాడి పట్టుకున్నారు. ఓ బైకు,రెండు ఫోన్లు,,కత్తి,బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. సీపీ మహేశ్ భగవత్,డీసీపీ సత్ సింగ్,ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఆదేశాలతో అతడిని రిమాండ్ కి తరలించినట్లు మీర్ పేట్ సిఐ మహేందర్ రెడ్డి చెప్పారు.
CM Jagan Mohan Reddy: పోలవరం నిర్వాసితులకు కేంద్రం పరిహారం ఇవ్వకుంటే నేనే ఇస్తా..!!
స్కూల్ బస్ డీ.. ఒకరి మృతి
మల్కాజిగిరి ప్రేమ్ విజయనగర్ కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. .సెయింట్ ఆన్స్ మినీ స్కూల్ వ్యాన్ రెండు స్కూటర్లను ఢీకొంది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోస్టుమార్గం కోసం మృతదేహం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మల్కాజిగిరి పోలీసులు