CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
- షాబాద్ ప్రాంతం ఆరుగురి హత్యలతో ఉలిక్కిపడింది
- 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్
- మే 16న నిందితుడిపై పోక్సో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతం ఆరుగురి హత్యలతో ఉలిక్కిపడింది. ప్రశాంతపు ఉదయం వేళ హత్యల సమాచారం అందరినీ భయాందోళనకు గురిచేసింది. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో రగిలిపోయిన నిందితుడు రాజ్ కుమార్ ప్రియురాలు మైనర్ బాలికను, ఆమెతోపాటు తల్లిని, నానమ్మను హత్య చేశాడు. ఆ తర్వాత భార్యా బిడ్డల్ని అంతమొందించి కారులో పరారయ్యాడు. ఈ మారణ హోమం కేవలం 20 నిమిషాల్లోనే సాగిందని పోలీసులు వెల్లడించారు. షాబాద్ ఆరుగురి హత్య కేసులో కొనసాగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 11 గంటల పది నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల మధ్యలో హత్యాకాండ కొనసాగినట్లు తెలిపారు. 11 గంటల పది నిమిషాలకి మైనర్ బాలిక ఇంటికి రాజకుమార్ చేరుకున్నాడు. 11. 12 నిమిషాలకి మైనర్ బాలిక ఇంటి తలుపు తట్టాడు. 11.13 రాజ్ కుమార్ తలుపు తట్టడంతో డోర్ ఓపెన్ చేసిన మైనర్ బాలిక తల్లి. డోర్ ఓపెన్ చేయగానే ఆమె కడుపులో కత్తితో పొడిచాడు. మైనర్ బాలిక తల్లి కింద పడగానే ఇంటి లోపలికి వెళ్ళాడు రాజకుమార్.. ఇంటి లోపల ఉన్న నాయనమ్మ రుక్కమ్మను గొంతు కోసి చంపాడు. రుక్కమ్మ చనిపోయిన తర్వాత బాలిక తల్లి లక్ష్మిని పొడిచి చంపిన రాజకుమార్.. ఇద్దరిని చంపేసిన తర్వాత మైనర్ బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లాడు.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాదుల చెరువు వద్దకు బాలికను తీసుకువెళ్లాడు. చెరువు వద్ద బాలిక గొంతు కోసి చంపేశాడు. బాలికను చంపేసి నేరుగా తన ఇంటికి వెళ్లాడు రాజకుమార్.. మధ్యాహ్నం సమయంలోనే ఇంటికి వస్తున్నట్లుగా భార్యతో చెప్పాడు. భర్త రాజ్ కుమార్ వచ్చిన సమయంలో బాలుడికి పాలు పట్టిస్తున్న భార్య.. భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన భార్య భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా విడవకుండా భార్య కడుపుతో పాటు గొంతు కోసి చంపేశాడు.
భార్య చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపేశాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చి తండ్రికి కాల్ చేశాడు రాజ్ కుమార్. ఆరుగురిని చంపేశాను తాను చనిపోతాను అంటూ తండ్రికి ఫోన్ లో చెప్పాడు. 11. 57 నిమిషాలకు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. 11 గంటల 57 నిమిషాలకు రాజ్ కుమార్ కారులో పారిపోయాడు. రాజ్ కుమార్ పెద్ద ఎత్తున ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టినట్లు పోలీసుల గుర్తించారు. దాదాపు రెండు కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి నష్టపోయినట్లు గుర్తించారు. గతంలో కూడా నిందితుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ..
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల ఘటనపై ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి కీలక వివరాలు వెల్లడించారు. రాత్రి జరిగిన ఈ ఘటనపై మాట్లాడిన ఆయన, దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలను వివరించారు. సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ, రాత్రి హత్య జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని, ఈ ఘటన రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగినట్లు తెలిపారు. మొదట నిందితుడు రాత్రి 11 గంటల సమయంలో షాబాద్‌లోని బాధితురాలి ఇంటికి వెళ్లాడని, అక్కడ బాధితురాలి తల్లి, నానమ్మను కత్తితో హత్య చేశాడని చెప్పారు. మే 16న నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయిందని, ఆ కేసులో అతనికి బెయిల్ లభించిందని సీపీ వెల్లడించారు.
నిందితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, బాధితురాలికి తల్లి, నానమ్మ ఉన్నారని తెలిపారు. బాధితురాలి తల్లి, నానమ్మను హత్య చేసిన అనంతరం, బాలికను నగర్‌కుంట సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడని వివరించారు. ఆ తర్వాత నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడని సీపీ తెలిపారు. హత్యల అనంతరం రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి “నేను ఆరుగురిని చంపాను… నేను కూడా చనిపోతున్నాను” అని చెప్పాడని వెల్లడించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ఏడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని సీపీ వెల్లడించారు. భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేయడం తమను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!