Honor Killing : ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిని చంపేసి తగులబెట్టేశారు!
- ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురిన హత్య చేసిన కుటుంబ సభ్యులు
- అనంతరం శరీరాన్ని కాల్చేసిన తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Killing : ఇటీవలి కాలంలో యువత ప్రేమ అంటూ లేని చిక్కులు తెచ్చుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూతురు ప్రేమించిన వ్యక్తి తమ కులానికి చెందిన వ్యక్తి కాదని కన్న తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. సమాజంలో పరువు ఎక్కడపోతుందో అని భావించిన తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు సొంత కుటుంబీకులే కూతురిని కిరాతకంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లోని ఝలావర్‌లో వెలుగు చూసింది. 24 ఏళ్ల యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులే హత్య చేశారు. వివరాల ప్రకారం.. భర్త ముందే మహిళను కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. తరువాత ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికలో కాల్చారు.
Read Also: Rahul Gandhi : హత్రాస్ ప్రమాదానికి ఎవరు బాధ్యులు.. రాహుల్ భోలే బాబా గురించి ఏం చెప్పారంటే ?
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో మహిళ తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా రవి భీల్‌ను వివాహం చేసుకున్నట్లు తేలింది. కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు దంపతులు వేరే ప్రాంతంలో మకాం వేశారు. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని బ్యాంకుకు దంపతులు వస్తున్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో అక్కడ ఆ యువతిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం కూతురిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను హత్య చేశారు. ఫిర్యాదు చేసేందుకు భర్త పోలీసులను ఆశ్రయించగా.. అప్పటికే ఆమె శరీరాన్ని మంటల్లో తగులబెట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మహిళ శరీరం 80 శాతానికి పైగా కాలిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. మహిళ కాలిన అవశేషాలను తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్‌కు పంపించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!