ఓ యువతి.. ప్రేమికుడికి క్షమాపణ చెప్పి తనువు చాలించింది. పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలని ఆకాంక్షించింది. అనంతరం శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో చోటుచేసుకుంది.
రాధా ఠాకూర్ (27) అనే యువతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. చాలా రోజుల నుంచి భర్త నుంచి విడిపోయి పాలన్‌పూర్‌లో సోదరితో కలిసి ఉంటుంది. ఆదివారం రాత్రి రాధా ఠాకూర్ ఇంటికి వచ్చింది. సోదరితో కలిసి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయానికి చూస్తే రాధా చనిపోయింది. ఆమె ఫోన్ చెక్ చేయగా ఆడియో రికార్డులు వెలుగుచూశాయి. ఆమె.. వేరే వ్యక్తితో ఫోన్‌లో సంభాషించినట్లుగా గుర్తించారు. వెంటనే రాధా సోదరి అల్కా పోలీసులను ఆశ్రయించింది. గుర్తుతెలియన వ్యక్తిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొబైల్‌లో రికార్డైన ఆడియోలో ప్రియుడికి క్షమాపణ చెప్పినట్లుగా గుర్తించారు. అయితే ఆమె అలా ఎందుకు క్షమాపణ చెప్పింది అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఆమె.. ఆ వ్యక్తిని ఫొటో అడగడం కూడా వినిపించింది. అయితే అతడు ఆ ఫొటో పంపించలేదు. అయితే గంటలోగా ఫొటో రాకపోతే ఏమవుతుందో చూడు అంటూ రాధా హెచ్చరించినట్లుగా ఆడియోలో వినిపించింది.
అనంతరం రాధా ఆడియో రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ప్రియుడికి క్షమాపణ చెప్పింది. ‘‘నన్ను క్షమించు.. మిమ్మల్ని అడగకుండానే తప్పు చేస్తున్నాను. బాధపడకండి.. సంతోషంగా ఉండడండి. జీవితాన్ని ఆస్వాదించండి. వివాహం చేసుకోండి. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయానని అనుకోవద్దు. చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నా. మీరు సంతోషంగా ఉంటే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. పని మరియు జీవితంపై కలత చెందాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను.’’ అని రాధా మరణానికి ముందు ఆడియో రికార్డ్‌లో పేర్కొంది.
ఇటీవల బెంగళూరుకు చెందిన సాప్ట్‌వేర్ అతుల్ సుభాష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నికిత, ఆమె కుటుంబ సభ్యులు పెట్టిన తప్పుడు కేసులతో విసిగిపోయానంటూ 80 నిమిషాల వీడియో రికార్డ్, 24 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో తాజాగా గుజరాత్‌లో మరో యువతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.